ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.  ప్ర‌స్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన ‘లవ్‌’ సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తుండ‌టం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.


రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డానికి  ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా, మూవీ లోని రెండో పాటని రిలీజ్ చేసారు, ‘జిందాబాద్ జిందాబాద్’ అంటూ సాగే ఈ మెలోడి మళ్లీ పాత మణిశర్మను గుర్తుకు తెస్తోంది. భాస్కర్ భట్ల సాహిత్యం అందించిన ఈ పాటను శరత్ సంతోష్, రమ్య బెహర ఆలపించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఆడియో హక్కులను జీ మ్యూజిక్ కొనుగోలు చేసింది. ‘జిందాబాదా’ లిరికల్ వీడియోను జీ మ్యూజిక్ సౌత్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పాటను రామ్, నభా నటేష్‌లపై గోవాలో చిత్రీకరించారు. షూటింగ్ విజువల్స్‌ను ఈ లిరికల్ వీడియోలో పొందుపరిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: