ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారాలు కూడా చేస్తూ తాజాగా నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాగే తాజాగా దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా నిర్మాణ రంగంలో అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. హీరోగా సౌత్ ఇండస్ట్రీలను బాలీవుడ్లోనూ తనకంటూ క్రేజ్ తెచ్చుకొన్న రానా ప్రస్తుతం నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ ఒకపక్క ప్రొడ్యూసర్ గా మరోపక్క సినిమా కెరియర్ పరంగా హీరోగా రాణిస్తున్నాడు.

Image result for rana

వ్యక్తిత్వ పరంగా రానా అంటే చాలా మందికి ఇష్టం. అలాగే రానాకి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు కూడా ఉన్నారు. బాహుబలి సినిమాతో బాగా పాపులర్ అవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రానా కి మంచి స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో రానా కి మంచి సంబంధాలు ఫ్రెండ్షిప్ ఉన్నాయి. అయితే ఈ మధ్య కరణ్ తన నివాసంలో సన్నిహిత మిత్రులకు ఒక పార్టీ ఇచ్చాడట.  

Related image

ఆ పార్టీలో పాల్గొనేందుకు రానాకు కూడా ఆహ్వానం వచ్చింది. దీంతో ముంబై వెళ్లి ఆ పార్టీ లో రానా పాల్గొన్నాడట. ఈ పార్టీలో బాలీవుడ్ లోని యంగ్ బ్యాచ్ అంతా హాజరయిందని సమాచారం. సోనాక్షి సిన్హా.. అనన్య పాండే.. ఇషాన్ ఖట్టర్.. తారా సుతారియా తదితరులు ఆ పార్టీలో ఉన్నారట. మరి రానా అదిపనిగా ముంబైకి వెళ్ళిమరీ పార్టీకి హాజరయ్యాడంటే.. జస్ట్ క్యాజువల్ పార్టీ అయి ఉండకపోవచ్చని.. కరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టులలో ఒకదానిలో రానాను నటింపజేసేందుకు చర్చ జరిగి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంమీద రానా ఒక పక్క హీరోగా మరో పక్క ప్రొడ్యూసర్ గా సూపర్ సక్సెస్ అవుతున్నాడని కామెంట్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు.




మరింత సమాచారం తెలుసుకోండి: