టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోస్ తో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోను సౌత్ లో బాగా బిజీగా ఉన్న హీరోయిన్ నయనతార. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నయన్ ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవరు అనుకోలేదు. కానీ తన టాలెంట్‌తో లాంగ్ టైం హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్-మురగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న దర్బార్‌లోనూ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరాలోను నటిస్తున్న సంగతి తెలిసిందే.


ఇదిలా ఉంటే  ఇవాళ తాప్సీ గేమ్ ఓవర్ తో పాటు నయనతార తమిళ సినిమా 'కొలైయుతిర్ కాలం' సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. అందుకోసం కొద్దిరోజుల క్రితం వరకు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి అనుకోకుండా బ్రేక్ పడింది. దర్శకుడు బాలాజీ కుమార్ ఈ కథ మీద తనకు హక్కులు ఉన్నాయని రచయిత సుజాత రచించిన నవలను 10 లక్షలకు హక్కులు కొన్నానని తనను సంప్రదించకుండా నేరుగా తీసి విడుదల చేస్తున్నారని ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. 


ఇది పరిశీలించిన న్యాయస్థానం రిలీజ్ మీద స్టే విధిస్తూ 21 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా నిర్మాతలకు నోటీసు పంపింది. ఇప్పుడిది పెద్ద వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ టైంలో సీనియర్ నటులు రాధారవి నయన్ మీద కామెంట్స్ చేసింది ఈ సినిమా ఫంక్షన్ లోనే. సో నయన్ హారర్ మూవీ కోర్టు మెట్ల దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు చక్రి తోలేటి తెలుగువాడే. కమల్ వెంకీలతో ఈనాడు, అజిత్ తో డేవిడ్ బిల్లా తెరకెక్కించాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: