తాప్సీ ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ డైరక్షన్ లో నిన్న అనగా శుక్రవారం రిలీజైన సినిమా గేం ఓవర్. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పింక్ సినిమా తర్వాత తాప్సీ చేసిన ఈ గేమ్ ఓవర్ సినిమా నటనలో ది బెస్ట్ అనిపించుకుందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు ముందు తాప్సీని హీరోయిన్ గా అనుకోలేదట.


కోలీవుడ్ లో ఇలాంటి ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లను అందుకుంటున్న నయనతార ముందు గేమ్ ఓవర్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. రెండు మూడు రోజులు షూటింగ్ కూడా చేశారట. కాని సినిమా కథ ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అనే వార్తలు రావడంలో నయనతార డ్రాప్ అయ్యిందట.  


అయితే ఆమె డ్రాప్ అవగానే ఆమె స్థానంలో తాప్సీని తీసుకుని సినిమా చేశారు. గేం ఓవర్ లో తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. లీడ్ రోల్ గా తాప్సీ అద్భుతంగా నటించి సినిమాకు ప్రాణం పోసింది. అయితే ఇదే సినిమా నయనతార చేసి ఉంటే వేరేలా ఉండేదని అంటున్నారు. నయనతారతో అనుకున్న కథలో టాటూ ఎపిసోడ్ లేదట. 


హాలీవుడ్ సినిమా కాపీ అంటున్నారని కథలో చిన్న మార్పులు చేశారట. ఏది ఏమైతేనేం నయనతార బదులుగా తాప్సీ చేసిన గేం ఓవర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల తర్వాత ఓ మంచి సస్పెన్స్ మూవీ చూశామని ఆడియెన్స్ రెస్పాన్స్ ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: