ఈ మద్య కొంత మంది యువ హీరోలు డూప్ లేకుండా కొన్ని యాక్షన్ సీన్లలో నటిస్తున్నారు.  దాంతో గాయాలు పాలు కావడం ఆసుపత్రిలో చికిత్స పొందడం ఆ వార్తలు కాస్త వైరల్ కావడం కామన్ అయ్యింది.  ఇటీవల గోపీచంద్ మూవీ షూటింగ్ లో గాయపడ్డారు.  తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యతీవ్ర గాయాల పాలయ్యారు. విశాఖపట్నంలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాల సందర్భంగా ఆయన గాయపడ్డారు.


ఐరా క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌లో భాగంగా హీరో నాగశౌర్య రోప్‌, డూప్‌ లేకుండా ఓ యాక్షన్‌ సన్నివేశంలో నటించారు.  షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్టంట్ చేసిన ఈ హీరో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ అంభరివ్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తుండగా హీరో నాగ శౌర్య జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తోంది.  అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని చిత్ర యూనిట్ తెలిపింది.


నాగ‌శౌర్య ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది.  నాగ శౌర్య నడవలేని పరిస్థితిలో ఉండడంతో సినిమా షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారు. ఛలో సినిమాతో గతంలో హిట్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసిన మరో సక్సెస్ అందుకోలేదు. నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: