యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ అప్‌క‌మింగ్ మూవీ 'సాహో' టీజర్ వ్యూస్‌ప‌రంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. యాక్ష‌న్ సీన్ల‌లో ప్ర‌భాస్ కూడా ఓ బైక్‌పై క‌ళ్లుచెదిరే స్పీడ్‌తో దూసుకెళ్తాడు. ప్ర‌భాస్ వాడిన ఆ బైక్ గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ మొద‌లైంది. 
ఓ చేజింగ్ సీన్‌లో ఓ బైక్‌పై ప్ర‌భాస్ టాప్ గేర్‌లో దూసుకు వెళ‌తాడు. ఆ సీన్‌లో ప్రభాస్ Triumph Street Triple RS Bike ని ఉపయోగించాడు.  ఈ బైక్ యూత్‌ను స్టైలీష్‌గా ఎట్రాక్ట్ చేసేలా ఉంది. ఇండియాలోనే కాదు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ బైక్ యూత్‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

బైక్‌కు వాడిన ఇంజిన్ చూస్తే.. 765 cc , మూడు సిలిండ‌ర్లు ఉన్నాయి. ప‌వ‌ర్ విష‌యానికి వ‌స్తే.. 123 PS @ 11700 rpm. అంతేకాదు ఈ బైక్‌కు 220 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉంది. 19 కిలో మీట‌ర్ల మైలేజీ ఇస్తుంది ఈ బైక్. ఈ బైక్ ధ‌ర కూడా అద‌ర‌హో అనిపిస్తోంది. షో రూం ధ‌ర 11 ల‌క్ష‌ల 13 వేల రూపాయ‌లు. ఆన్‌రోడ్ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి 12 ల‌క్ష‌ల 40 వేల దాక అవుతోంది. 
ప‌వ‌ర్‌ఫుల్ ఇంజిన్, స్పీడ్ కెపాసిటీ, స్టైలీష్ లుకింగ్.. వంటి ఫీచ‌ర్స్‌తో ఉన్న ఈ బైక్‌.. డార్లింగ్‌కు స‌రిగ్గా స‌రిపోయిందంటున్నారు యంగ్ రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్.  


మరింత సమాచారం తెలుసుకోండి: