విజయ్‌ దేవరకొండ 'గీత గోవిందం' ముందు ఓకే చేసిన కథల్లో 'డియర్‌ కామ్రేడ్‌' ఒకటి. విజయ్‌ పొటెన్షియల్‌ ఎంత అనేది తెలిసిన తర్వాత 'డియర్‌ కామ్రేడ్‌' లెక్కలు మారాయి. అప్పట్నుంచి కథకి అనేక మార్పు చేర్పులు చేస్తూ వచ్చారు. గత యేడాదిలోనే పూర్తి కావాల్సిన ఈ సినిమా మధ్యలో కొన్నాళ్లు ఆగిపోయి మళ్లీ మొదలయింది. ఇక ఈ సినిమాను ముందు మే 31న రిలీజ్‌ చేస్తున్నమని చెప్పి పనులు పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్‌ను వాయిదా వేసారు.


ముందుగా అనుకున్న వర్క్‌ అయితే ఆల్రెడీ పూర్తయిందట. కానీ రఫ్‌ కట్‌ చూసుకున్నాక రిపేర్‌ వర్క్‌ మొదలు పెట్టారట చిత్ర బృందం. ఆ వర్కే ఇంకా కంప్లీటవలేదని, ఇప్పటికీ షూటింగ్‌ జరుగుతూనే వుందని లేటెస్ట్‌గా అందిన సమాచారం. జులై 26న రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయింది కానీ షూటింగ్‌ మాత్రం ఇంకా బ్యాలెన్స్‌ వుండడంతో రిలీజ్‌ డేట్‌ మారుతుందా అనే డౌట్స్‌ మళ్ళీ వస్తున్నాయి. కానీ ఈ డిలే ఊహించడం వలనే ముందుగా అనుకున్న దానికి రెండు నెలల గ్యాప్‌ ఇచ్చారట.  


సినిమా పట్ల ఆసక్తి పెంచడానికి విడుదల చేసిన టీజర్‌ బాగానే వర్కవుట్‌ అయింది. కాస్త కాంట్రవర్సీ అయినప్పటికి అది సినిమా పబ్లిసిటీకి బాగానే ఉపయోగపడింది. అలాగే ఇంతవరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా క్లిక్‌ అయ్యాయి. ఇక ఈ సినిమాని సెకండ్‌ పార్టీ వాళ్లకి అర్జున్‌రెడ్డి బిజినెస్‌ రేంజ్‌కి తగ్గట్టు అమ్మినా కానీ థర్డ్‌ పార్టీల వాళ్లు మాత్రం 'గీత గోవిందం' వసూలు చేసిన దానికి అనుగుణంగా రేట్లు మాట్లాడుతున్నారని తెలిసిందని మరో లేటెస్ట్ న్యూస్. ఈవన్నీ బాగానే ఉన్నాయిగాని అసలు రిలీజెప్పుడవుతుంది అన్న దాంట్లో మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: