సినీ హీరోల రాజకీయాలు వేరేగా ఉంటాయి. అవి సమయం వచ్చినపుడే బయటపడతాయి. టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ అంటే అందరూ ఒకే అంటారు. బాగా ఉన్నట్లుగానే కనిపిస్తారు. కానీ లోపల ఏదో ఉంటుంది. అది ఏదో ఓ టైంలో బయటపడుతుంది.  ఇపుడదే జరుగుతోంది మరి.



ఇంతకీ విషయం ఏంటంటే ప్రముఖ టాలీవుడ్ హీరో సుమన్ ఈ రోజు పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. పవన్ జనసేన పార్టీ పెట్టి టీడీపీ దారుణంగా ఓడిపోవడానికి కారణమయ్యాడని డైరెక్ట్ అటాక్ చేశారు. పవన్ వల్లనే టీడీపీకి ఈ దీన స్థితి అంటూ ఘాటుగానే మాట్లాడారు. నిజంగా టీడీపీ నాయకులు కూడా ఇంతవరకూ పవన్ మీద ఈ టైప్ లో కామెంట్స్ చేయలేదు.


ఇపుడు సుమన్ చేశాడు కాబట్టి  తమ్ముళ్ళు కొందరు గొంతు సవరించుకోవచ్చునేమో. అయితే సుమన్ మాత్రం మొత్తం విశ్లేషణ చేసినట్లుగా టీడీపీ ఓటమికి పవనే కారణమని  తేల్చేశారు. ఇక జగన్ 151 సీట్లు గెలవడం షాకింగ్ అంటూ సుమన్ అభినందనలు తెలిపారు. తాను పుట్టినప్పటి నుంచి ఒకే పార్టీ ఇన్ని సీట్లు గెలవడం చూడలేదని, ఇదంతా జగన్ రెక్కల కష్టమేనని సుమన్ కితాబు ఇచ్చారు. మొత్తానికి సుమన్ పవన్ని ఏకేసిన తీరుపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమంటారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: