యువ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. బ్రేకప్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర లీక్ అయింది.


సినిమాలో విజయ్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రైటర్ గా కనిపిస్తాడట. ఒకేసారి మూడు కథలు నడిచే ఈ సినిమాలో మూడు కథల్లో హీరో తనే కనిపిస్తాడట. విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ సినిమా కాన్సెప్ట్ అదే.. విజయ్ క్యారక్టర్ కూడా ఇదే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.


అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల్లో ఉన్నట్టుగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ కనిస్తాడని తెలుస్తుంది. మరి సినిమాలో ఒక హీరోయిన్ ఉంటేనే రెచ్చిపోయే విజయ్ ముగ్గురు హీరోయిన్స్ తో ఎలా రెచ్చిపోతాడో చూడాలి. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటుగా ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో హీరో సినిమా చేస్తున్నాడు.


మొత్తానికి విజయ్ దేవరకొండ తన హిట్ ట్రాక్ కొనసాగించేలా భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ సినిమా వచ్చే నెల రిలీజ్ ప్లాన్ చేయగా ఈ సినిమాలో కూడా రష్మికతో లిప్ లాక్ సీన్స్ అదరగొట్టాడట విజయ్ దేవరకొండ. గీతా గోవిందం హిట్ పెయిర్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: