ప్రస్తుతం బుల్లితెరపై మంచి క్రేజ్ మరియు అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకెళ్తున్న షోల్లో ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో కూడా ఒకటని చెప్పవచ్చు. ఇక ఈ షో వీడియోలకు యూట్యూబ్ లో లక్షలకొద్దీ వ్యూస్ వస్తుంటాయి అంటే జబర్దస్త్ కు మన తెలుగు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆ షోలో పార్టిసిపేట్ చేసే నటుల్లో ఎవరికివారు తమ ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. 

ఇకపోతే వారిలో తన డిఫరెంట్ కామెడీ పెరఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకునే నటుల్లో ఒకడైన చలాకి చంటి, నేడు కారు యాక్సిడెంట్ కి గురయ్యాడు. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం, నేటి తెల్లవారుఝామున చంటి ప్రయాణిస్తున్న కారు హఠాత్తుగా ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో పెను ప్రమాదం జరిగినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో చంటి విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

అయితే ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో చంటికి పెద్ద గాయాలవలేదని, తెల్లవారుఝాము సమయం కావడంతో ఆగి ఉన్న లారీ కనపడకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ వార్త ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: