సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ తలనొప్పులు కూడా ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. వాళ్ళ పర్స్నల్ విషయాల దగ్గర్నుంచి ప్రొఫేషనల్ విషయాల వరకు అన్నీ సోషల్ మీడియాలో లీక్ చేసి నిజమో కాదో తెలుసుకోకుండా నానా రచ్చ చేస్తుంటారు. డైరెక్ట్ గా ఫ్యాన్స్ తో టచ్ లో  ఉండేందుకు.. తమ సినిమాలకు చక్కగా ప్రమోషన్ చేసుకునేందుకు సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. అయితే కొందరు ఊరుపేరు లేని గన్నయ్యలు మాత్రం ట్వీట్స్‌తో పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటారు. ఎంతపెద్ద స్టార్ అయినా.. ఆఖరుకు ప్రధానమంత్రి అయినా కూడా వీళ్ళ నుండి తప్పించుకోలేరు. ఇక రీసెంట్ గా సమంతకు ఇలాంటి ఒక గన్నయ్యే ఎదురయ్యాడు.
 
డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్ చిన్మయి శ్రీపాద డైరెక్టర్ కం యాక్టర్ రాహుల్ రవీంద్రన్ భార్య అన్న విషయం తెలిసిందే. అంతేకాదు సామ్ కు క్లోజ్ ఫ్రెండ్ కూడా. సమత మొదటి సినిమా నుండి దాదాపు అన్నీ సినిమాలకు సామ్ కు తన గొంతు అరువిస్తుంది. అలానే 'ఓ బేబీ' తమిళ వెర్షన్ లో సమంత కు చిన్మయి డబ్బింగ్ చెప్పింది.  వైరముత్తుపై ఆరోపణలు.. తర్వాత డబ్బింగ్ యూనియన్ నుండి చిన్మయిని బ్యాన్ చేయడం అందరికీ తెలిసిన పాత కథే.  ఈ ఎపిసోడ్ తర్వాత రీసెంట్ గా చిన్మయిపై నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. 


ఇక నిషేధం ఎత్తివేసిన తర్వాత చిన్మయి డబ్బింగ్ చెప్పిన మొదటి సినిమా 'ఓ బేబీ'.  ఈ సందర్భంగా చిన్మయి తన ట్విట్టర్ ఖాతా ద్వారా హీరోయిన్ సమంత కు.. దర్శకురాలు నందినీ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ట్వీట్ కు రిప్లై గా ఒక గన్నయ్య "ఫెమినిస్టులు అందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. మూవీ పక్కా ఫ్లాప్" అంటూ కామెంట్ పెట్టాడు.  దీంతో సమంత కు కోపం రావడంతో ఇడియట్ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా రిలీజైన ఓ బేబి థియోట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదుచూస్తున్న డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాతో తనకు పక్కా హిట్ పడుతుందని చాలా కాన్‌ఫిడెంట్‌గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: