మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి గుమ్మడికాయ కొట్టి సినిమా రిలీజయ్యోవరకు గాసిప్పుల మీద గాసిప్పులు పుట్టించేస్తుంటారు. వాస్తవాలు ఎవరికి కావాలి..క్రేజీనెసే ఇంపార్టెంట్ అనుకునే పనీ పాటా లేని వాళ్ళే ఈ గాసిప్పులను ఎక్కువగా క్రియోట్ చేసి శునకానందాన్ని పొందుతుంటారు. రీసెంట్‌గా అలాంటి పుకారే ఒకటి బాగా స్ప్రెడ్ అయింది. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా కొనసాగుతూ మిల్కీ బ్యూటీ తమన్నా అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది. సౌత్ సినిమాలు తమన్నా చేతిలో ప్రస్తుతం నాలుగైదు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ 'సైరా' కూడా ఒకటి.  


ఈ సినిమాలో తమన్నా ఒక నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తోందని ఈమధ్య వార్తలు బాగా వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం తమన్నా 'సైరా' లో ఎటువంటి నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటించడం లేదట.  మరి ఏ పాత్రలో నటిస్తోందనే వివరాలు మాత్రం బైటకు రాకుండా 'సైరా' టీమ్ జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ సినిమాలో తమన్నా పాత్ర మాత్రం చాలా కీలకమైనదని లేటెస్ట్ న్యూస్.  'సైరా' లో నయనతార మెయిన్ హీరోయిన్ గా మెగాస్టార్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. 


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణిగా నయన్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తమన్నాకు ఒక ప్రత్యేకత ఉంది.. అటు తనయుడు రామ్ చరణ్ తోనూ.. ఇటు తండ్రి చిరంజీవితోనూ కలిసి నటించిన అతి తక్కువమంది హీరోయిన్లలో తమన్నా ఒకరు. గతంలో కాజల్ అగర్వాల్ అటు రామ్ చరణ్, ఇటు చిరంజీవితోనూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: