నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. అయితే కమర్షియల్ గా మాత్రం సినిమా పెద్దగా లాభాలు తెచ్చింది ఏమి లేదు. నాని నటనా ప్రతిభ మరోసారి అందరికి తెలిసేలా చేసింది. అయితే జెర్సీ సినిమా ఓ ఎమోషనల్ మూవీ.


తండ్రి కొడుకుల మధ్య సాగే సన్నివేశాలు చాలామందికి కనెక్ట్ అవుతాయి. అది ఆడియెన్స్ లోనే కాదు సినిమా వాళ్లకు కూడా కనెక్ట్ అవుతాయని తెలిసింది. ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య గుర్తున్నాడు కదా మనసంతా నువ్వే, నేనున్నాను సినిమాలు తీసిన ఆ దర్శకుడికి జెర్సీ సినిమా ఎఫెక్ట్ పడ్డది.


తన కొడుకు జెర్సీ సినిమా చూసి నాన్న నువ్వు ఎందుకు సినిమాలు తీయట్లేదని అడిగాడట. అలా అడగడమే ఆలస్యం వి.ఎన్.ఆదిత్య సినిమాలను తానే కాదు తన కొడుకు మిస్ అవుతున్నాడని అనిపించిందట. అందుకే త్వరలోనే ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అప్పట్లో వి.ఎన్ ఆదిత్యకు దర్శకుడిగా మంచి క్రేజ్ ఉంది. కాని ఆయన ట్రాక్ తప్పేశాడు. 


మరి కొద్దిపాటి గ్యాప్ తో కొత్త సినిమా చేయాలని అనుకుంటున్న వి.ఎన్ ఆదిత్య తప్పకుండా సక్సెస్ అవుతాడని అవ్వాలని ఆశిద్దాం. ఓ సినిమా వల్ల తన కొడుకు తనని సినిమా చేయమని అడుగుతాడని ఆదిత్య కూడా ఊహించి ఉండడు. వి.ఎన్ ఆదిత్య ఈసారి ఎలాంటి సినిమా చేస్తాడు.. కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: