యోగ దినోత్సవ సందర్బంగా సెలెబ్రెటీస్ యోగా చేస్తూ అభుమానులను అలరిస్తున్నారు. అయితే రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  అందులో ఒక వేలాడే తాడు లాంటి వస్త్రం సహాయంతో గాల్లో తేలుతూ వివిధరకాల యోగాసనాలు చేసింది. కొన్ని యోగాసనాలు సులువుగా చేసేందుకు.. సపోర్ట్ గా ఈ క్లాత్ ఉపయోగపడుతుంది.


ఈ ఫోటోలకు "హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. నేను అనుష్క పర్వాని గారి యోగా క్లాస్ కు హాజరైనంత వరకూ నేను యోగా చేసేదాన్ని కాదు.  ఇప్పుడు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటే నా ప్రపంచం పర్ఫెక్ట్ గా ఉంది.  మనసులో శాంతి.. సంతోషం.. గాయాల నుండి ఉపశమనం కూడా లభిస్తున్నాయి. అనుష్కగారు.. నన్ను యోగా అడిక్ట్ గా మార్చినందుకు థ్యాంక్ యూ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.


ఇక రకుల్ ఫోటోలు చూస్తేనే ఏ రేంజ్ లో యోగాసనాలు వేస్తుందో మనకు అర్థం అవుతుంది.  ఈ ఫోటోలకు కామెంట్లు కూడా భారీ రేంజ్ లో వచ్చాయి.  "యోగా పేరుతో స్టంట్లు చేస్తున్నావే".. "యోగా డే బ్యూటీ హంగామా".. "నువ్వు హీరోయిన్ వా యోగా టీచర్ వా".."ఒక్క ఫోటోలో కూడా చక్కగా నిలబడలేదు"  అంటూ కామెంట్లు పెట్టారు. ఏదైతేనేం.. రకుల్ కూడా యోగా స్పెషలిస్ట్ అని అందరికీ అర్థం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: