టాలీవుడ్ లో ఒకప్పడు ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించిన యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్.  సినీ పరిశ్రమకు చెందిన నటి జీవితను వివాహం చేసుకున్న తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించారు.  కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఆయన కొంత కాలం సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చారు.  ఆ మద్య గరుడవేగ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ రాజశేఖర్ మంచి విజయం అందుకున్నాడు.  ఈ సినిమా విజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని  'కల్కి' సినిమా చేశాడు.

ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది.కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత ఈ కథ తనదేనని చెబుతున్నాడు. రాజశేఖర్ అప్పట్లో నటించిన చివరి సినిమా ‘మహంకాళి’. ఆ సమయంలో కార్తికేయ కలిసి రాజశేఖర్ కి 'కల్కి' టైటిల్ తో కథ చెప్పరట  స్క్రిప్ట్ కూడా ఇచ్చారట. 

ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ ఎక్కువవుతుందిని  ఇప్పుడు అంత పెట్టలేం  అని రాజశేఖర్ అన్నారట.  వేరే ప్రయత్నాల్లో ఉండిపోయానని అంటున్నారు కార్తికేయ. అయితే  ఇప్పుడు అదే కథకి కొన్ని మార్పులు చేసి తీశారు. ఈ విషయంపై రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాను. అసోసియేషన్ కమిటీ సభ్యులు 'కల్కి' యూనిట్ ను చర్చలకు పిలిస్తే రావడం లేదు. 'కల్కి' యూనిట్ నుంచి నేను డబ్బులు ఆశించడం లేదు క్రెడిట్ ఇస్తే చాలు అని చెప్పుకొచ్చారు కార్తికేయ. 



మరింత సమాచారం తెలుసుకోండి: