మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ మళ్లీ పుంజుకుందని చెప్పొచ్చు. ఈమధ్య అమ్మడు కెరియర్ లో బాగా వెనుకపడినట్టు కనిపించగా ఎఫ్-2 హిట్ తో కొత్త జోష్ తో దూసుకెళ్తుంది. అభినేత్రి-2, కామోషి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా ఆ రెండు సినిమాలు ఫెయిల్ అవడంతో డిజప్పాయింట్ అయ్యింది.


అయితే లక్కీగా ఆమెకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. యాంకర్ ఓంకార్ డైరక్టర్ గా మారి హిట్ కొట్టిన సినిమా రాజు గారి గది. మొదటి సినిమా హిట్ అవగా రాజు గారి గది 2 అంటూ మరో సినిమా చేశాడు. రాజు గారి గది 2లో కింగ్ నాగార్జున, సమంత వంటి స్టార్స్ నటించడం జరిగింది. అయినా సరే ఆ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.


ఇక కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాజు గారి గది 3 మొదలు పెట్టాడు ఓంకార్. తమ్ముడు అశ్వినే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మిల్కీ బ్యూటీ భయపెట్టేందుకు రెడీ అవుతుందన్నమాట. కెరియర్ కాస్త స్లో అవగానే ఆమె పని అయిపోయిందని వార్తలు వచ్చాయి. కాని అలా అనుకున్న ప్రతిసారి తమన్నా మళ్లీ అవకాశాలను దక్కించుకుంటుంది.


కొత్త వాళ్లు వస్తుంటే సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు ఛాన్సులు లేవని వార్తలు వస్తుంటాయి. కాజల్, తమన్నా కెరియర్ లో వెనక్కి తగ్గినట్టే తగ్గి వరుస సినిమాలు చేస్తూ అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ రాజు గారి గది 3 అయినా ఆమెకు సూపర్ హిట్టు ఇచ్చి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుందేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: