సినీ పరిశ్రమలలో ఒక్కో సందర్భంలో రెండు లేక మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవడం మనం ఇదివరకు కొన్ని సందర్భాల్లో చూసాం. అయితే అటువంటి సందర్భాల్లో విడుదలయ్యే అన్ని సినిమాలకు కొంతమేర థియేటర్లు, అలానే కలెక్షన్ల విషయమై నష్టం ఏర్పడుతూ ఉంటుంది. అదే అందులో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం దానికి మరింత నష్టం వాటిల్లుతుంది. ఇక ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, 

రాబోయే ఆగష్టు నెలలో రెండు పెద్ద సినిమాలైన మన్మధుడు2, సాహో సినిమాలు ఒక వారం గ్యాప్ లో విడుదల అవుతుండడంతో రెండు సినిమాల నిర్మాతలకు కొంత మేర ఇబ్బంది ఏర్పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే  ఈ రెండు సినిమాల్లో మన్మధుడు2 కి కొంత మేర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం. ఎదుకంటే ముందుగా ఆగష్టు 9న ఆ సినిమా విడుదలవుతుండటంతో ఒకవేళ టాక్ కాస్త అటు ఇటు అయితే తమ సినిమా పరిస్థితి ఏంటని లోలోపల చిత్ర యూనిట్ మధనపడుతున్నట్లు కొన్ని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. నిజానికి ఆ సినిమా యూనిట్ అంతలా ఆలోచించడానికి కారణం సాహో సినిమానే అట, 

ఇదివరకు ప్రభాస్ బాహుబలి చేసి ఉండడం, అలానే భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక నిపుణులతో హాలీవుడ్ రేంజిలో రూపొందుండడంతో సాహో సినిమాకు ఓపెనింగ్స్ సూపర్ గా వస్తాయని అర్ధం అవుతుంది. ఇక ఒకవేళ సినిమా అనుకున్న అంచనాలు అందుకుని మంచి సక్సెస్ అయితే మాత్రం, దాని కలెక్షన్లకు అడ్డుకట్ట పడదు. అయితే అలా కాకుండా మన్మధుడు2, సాహో రెండు సినిమాలు మంచి సక్సెస్ అయితే మాత్రం ఆయా రెండు సినిమాల నిర్మాతలు చాలావరకు సేఫ్ అయినట్లే అంటున్నారు. మరొక రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకుని తమ నిర్మాతలకు లాభాలు తీసుకువస్తాయి తెలియాలంటే వాటి విడుదల వరకు వేచిచూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: