Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 2:45 pm IST

Menu &Sections

Search

20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్

20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ అంతా నటి అమలాపాల్‌ గురించే. అందుకు కారణం ఈ సంచలన నటి నటించిన ఆడై చిత్రంలో పోషించిన పాత్రనే.  కథనాయకి ఇతివృత్తంతో కూడిన చిత్రం ఇది. ఇంతకుముందు మేయాదమాన్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం ద్వారా పరిచయం అయిన రతన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఆడై. ఆ మధ్య విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టరే సంచలనం సృష్టించింది.

దుస్తులు లేకుండా ఒంటికి టాయిలెట్‌ పేపర్‌ చుట్టుకున్న అమలాపాల్‌ ఫొటోతో కూడిన ఆ పోస్టర్‌ ఆడై చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల విడుదల చేసిన ఆడై చిత్ర టీజర్‌ మరింత ప్రకంపనలను సృష్టిస్తోంది. అందులో నటి అమలాపాల్‌ పూర్తి నగ్నంగా కూర్చుని ఏడుస్తున్న దృశ్యం చోటు చేసుకోవడమే కారణం. అలాంటి సన్నివేశంలో అమలాపాల్‌ ధైర్యంగా నటించడం చర్చనీయాంశంగా మారింది. చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల కోసం నటి అమలాపాల్‌ 20 రోజులు దుస్తుల్లేకుండా నటించిందట. ఇది సాధారణ విషయం కాదు.

అందుకు అమలాపాల్‌ ధైర్యాన్ని  నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నటి సమంత వంటి తారలు అమలాపాల్‌ను అభినందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు మిలియన్ల ప్రేక్షకులు వీక్షించడం విశేషం. ఇలా ఇంతకుముందు ఏ చిత్రానికి రానట్టుగా లైక్స్‌ రికార్డు స్థాయిలో వచ్చాయట. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌ ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.

ఆడై చిత్రం ఒక వ్యక్తి స్వేచ్ఛ, సంప్రదాయాల గురించి చర్చించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ వర్గాలు అంటున్నారు. ఇందులో అమలాపాల్‌ నగ్నంగా నటించడం వంటి సన్నివేశాలతో పాటు, మోటార్‌ బైక్‌ నడపడం, విలన్లతో ఫైట్‌ చేయడం వంటి సాహసాలు చేసిందట. ఇది కచ్చితంగా ఆమె కేరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని ఆడై చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది.


amala
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తనదైన శైలిలో నెటిజన్లకు అనసూయ సమాధానం
రకుల్ కు 'ఇండియన్‌–2'లో అవకాశం
పోలీసుల స్పేషల్ డ్రైవ్... వారం రోజుల్లో 645 కేసులు నమోదు... ఎందుకంటే?
జాన్వీతో... కీర్తీ దోస్తీ
వ్యవసాయం తర్వాత చేనేత రంగానికి ప్రాధాన్యత... ఎమ్మెల్యే ఆళ్ల
కుమారస్వామి షాకింగ్ నిర్ణయం... సీఎంగా శివ కుమార్..?
ఉజ్జయిని బోనాలలో స్వర్ణలత భవిష్యవాణి
`హేయ్ మెనీనా..` మన్మధుడు-2 లిరికల్ సాంగ్ విడుదల
‘మన్మథుడు2’ వినూత్న ప్రచారం.... దర్శకుడు రాహుల్ కు చుక్కలు చూపించిన నాగార్జున
కన్ను కొట్టి చూసేనంట సుందరి...  రణరంగం రెండో పాట విడుదల
‘నిశ్శబ్ధం’ అంటున్నఅనుష్క
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు పీవీ సింధు
రాష్ర్టవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నెల్
రేపు చంద్రయాన్ -2 ప్రయోగం
రాజేంద్రప్రసాద్ కొత్త చిత్రం `కాలేజ్ కుమార్`
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.