ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్ మాత్రమే ఇస్తున్నారు. అంటే దానర్థం ఆ సినిమాలో హీరోయిన్‌కి అసలు ఇంపార్టెంట్ ఉండదు అని. నిజానికి చాలా సినిమాల్లో ఇదే తంతు. జస్ట్ హీరోయిన్ అలా వస్తుంది ఓ పాటేసుకుంటుంది..వెళ్ళిపోతుంది. అందుకే హీరోయిన్లకి అందమైన రూపం వుంటే చాలనుకునే  ఈ రోజుల్లో నటించగలిగిన వారు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా భావోద్వేగాలని పండించడంలో ఆ తరం నటీమణులకి ఇప్పటి తరానికీ పోలికే లేదు. అయితే కమర్షియల్‌ హీరోయిన్లుగా సక్సెస్‌ అవుతారు, లేదా పర్‌ఫార్మెన్స్‌ చేయగలదని అనిపించుకుంటారు తప్ప రెండు విధాల మెప్పించే హీరోయిన్స్ చాలా తక్కువగా ఉన్నారు. అయితే ఈ తరం హీరోయిన్లలో సమంత మిగిలిన అందరికంటే ప్రతిభావంతురాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 


ముఖ్యంగా ఆమె ఎమోషన్స్‌ పలికించే తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు 'మజిలీ' సినిమానే తీసుకుంటే తన పాత్ర ప్రవేశించిన తర్వాత సినిమా రేంజే మారిపోయింది. హీరో ప్రధానంగా సాగే కథ అయినప్పటికి తన పరిధిలోనే సమంత తన ముద్ర వేసి సినిమా హిట్ కి మేయిన్ రీజన్ అయింది. పెళ్లి తర్వాత వస్తున్న అవకాశాలలో తనకి నచ్చిన కథలు చేస్తోన్న సమంత ఈ ఫేజ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తోంది. 


ఇక రీసెంట్‌గా 'ఓ బేబీ' ట్రెయిలర్‌ చూస్తేనే సమంత ఎంతగా ఆ పాత్రలో లీనమయిందనేది అర్థమవుతుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేని వారికి కూడా ట్రెయిలర్‌ చూసిన తర్వాత ఇది చూడాలనే ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమాతో సోలోగా సమంత కనుక బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోగలిగితే ఇక సమంత నుంచి మరిన్ని అద్భుతమైన పాత్రలు ఆశించవచ్చు అనిపిస్తోంది. అందుకే కొంతమంది సమంతను అప్పటి టాప్ హీరోయిన్ మహనటి సావిత్రితో పోలుస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: