స్టార్ హీరో, హీరోయిన్ వాళ్ల స్క్రీన్ పేర్లనే వారి అసలు పేర్లుగా భావిస్తాం. కాని చాలావరకు వారి అసలు పేరు ఒకటి స్క్రీన్ మీద మరొకటి ఉంటుంది. తెలుగులో అలాంటి స్టార్స్ చాలామంది ఉన్నారు. చిరంజీవి దగ్గర నుండి అందరి పేర్లు సిల్వర్ స్క్రీన్ పై మార్చబడినవే. అయితే కోలీవుడ్ లో కూడా అసలు పేరు ఒకటైతే వెండితెర మీద పడ్డ పేరు మరొకటి అలా మార్చుకున్న పేరుతోనే వారు సూపర్ స్టార్ అయ్యారు. ఇంతకీ మార్చుకున్న పేరుతో సూపర్ స్టార్స్ అయిన వారు ఎవరంటే.


ముందుగా చెప్పాల్సింది సూపర్ స్టార్ రజినికాంత్ గురించే.. శివాజి రావు గైక్వాడ్ కాస్త రజినికాంత్ గా మారాడు. బస్ కండక్టర్ గా పనిచేసే ఆయన డైరక్టర్ బాలచందర్ కంట పడటంతో స్టార్ అయ్యాడు. అప్పటికి ఇప్పటికి రజిని స్టైల్ లో మాత్రం తేడా లేదని చెప్పొచ్చు. ఇక తర్వాత స్టార్ హీరో ఇళయదళపతి విజయ్. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్ర శేఖర్. తన పేరులోని మిడిల్ నేమ్ ను మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై ఉంచుకున్నాడు విజయ్.


ఇక సూర్య అసలు పేరు కూడా శరవణన్ శివకుమార్. ఆ తర్వాత సూర్య శివకుమార్ గా మార్చుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రం అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్. క్రిస్టియన్ ఫాదర్, హిందు మదర్ కావడం వల్ల ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక విక్రం అని మార్చుకున్నాడు. మరో కోలీవుడ్ హీరో ఆర్య కి తన అసలు పేరు అది కాదని తెలుస్తుంది. ఆర్య అసలు పేరు జెమ్ షెడ్ చెతిరకత్ అట. డైరక్టర్ జీవా అతని పేరు ఆర్యగా మార్చారు.  


హీరో జీవా అసలు పేరు అమర్. ఇక హీరోలే కాదు హీరోయిన్స్ కూడా వారి పేర్లు మర్చుకున్నారు. మారిన పేరుతో స్టార్స్ అయిన వారిలో నయనతార ఒకరు. ఆమె అసలు పేరు డయానా మారియం కురియన్. కోలీవుడ్ లో నయనతారకు ఓ స్టార్ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఉంటుంది. స్నేహ అసలు పేరు కూడా అది కాదు.. ఆమె పేరు సుహాసిని రాజారాం. సీనియర్ నటి రేవతి అసలు పేరు ఆశా కుట్టి సినిమాల్లో రేవతిగా మార్చుకున్నారు. ఇక మ్యూజిక్ డైరక్టర్ ఏ.ఆర్.రహమాన్ అసలు పేరు ఏ.ఎస్ దిలీప్ కుమార్. తన సోదరి అనారోగ్యం వల్ల దిలీప్ కుమార్ గా ఉన్న అతను అల్లా రఖా రహమాన్ గా మారాడు. 
  


మరింత సమాచారం తెలుసుకోండి: