దగ్గుబాటి రానా ఒక్క సౌత్ ఇండస్ట్రీ లోనే మాత్రమే కాక యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. చాలా భాషలలో నటించిన రానా బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుకున్నాడు. ఇటువంటి గ్రామంలో తాజాగా ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ సౌత్ ఇండస్ట్రీ అంటూ కించపరిచే విధంగా మాట్లాడటంతో రానా అదిరిపోయే సమాధానం ఇచ్చిన యాంకర్ తలదించుకునేలా చేశాడు.


ఇంతకీ జరిగిందేమిటంటే మీడియా ఛానల్ యాంకర్ రానా ని ప్రశ్నలు అడుగుతూ ఉన్న క్రమంలో సరదాగా రానా సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇటువంటి సమయం లో యాంకర్ సౌత్ సినిమాలకు కాస్త చిన్నచూపు చూస్తున్నట్లు ప్రశ్న ఇలా వేసింది….తన చిన్నతనంలో రోజా సినిమా చూశానని ఆ తర్వాత చూసిన సౌత్ ఇండియన్ సినిమాలన్నీ ఒకే తరహాలో ఉన్నట్లు తనకు అనిపించిందని సదరు యాంకర్ తెలిపింది.


కానీ బాహుబలి చిత్రం ఓ అద్భుతం అని చెబుతూ.. ఆ చిత్రంతో సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ లో చాలా మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. దీనిపై రానా స్పందిస్తూ.. ఇండియన్ సినిమా అభిమానులకు ఇతర భాషల సినిమాలపై ఇలాంటి అభిప్రాయం ఉంటుందని నేననుకోను. అసలు ఇండియన్ మూవీ లవర్స్ భాష గురించి పట్టించుకోరు. అన్ని సినిమాలని ఆదరిస్తారు. బాహుబలి కంటే ముందు రజినీకాంత్ సినిమాలు అన్ని భాషల్లో విజయం సాధించాయి. అవెంజర్స్ చిత్రం ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజై విజయం సాధించింది. మీరంటున్నట్లు భాష సరిహద్దులు లేవని రానా తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: