తమిళంలో సూపర్ డూపర్ హిట్స్ ని కొని టాలీవుడ్‌లో రీమేక్ చేయడం చాలా కామన్. సూపర్ గుడ్ ఫిలింస్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు ఇలా చాలా సినిమాలను తెలుగులో రీమేక్ చేసి పెద్ద కమర్షియల్ సక్సస్ ను అందుకున్నారు. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తమిళ హీరో అథర్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'వాల్మీకి'.  తమిళ సూపర్ హిట్ ఫిలిం 'జిగార్తాండ'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను హరీష్ శంకర్ రీసెంట్‌గా వెల్లడించారు.  ఈ సినిమా ప్రీ టీజర్ ను విడుదల చేస్తున్నామని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 


డైలాగ్స్ లేని 'వాల్మీకి' ప్రీ టీజర్ ను జూన్ 24 సాయంత్రం 5.18 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతే కాకుండా ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయని కూడా హరీష్ వెల్లడించారు.  ఈ సినిమాలో వరుణ్ తేజ్ మొదటిసారిగా నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రీ-టీజర్లో వరుణ్ తేజ్ గెటప్ ను రివీల్ చేయనున్నారని లేటెస్ట్ న్యూస్.  ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక కీలకపాత్రలో నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 6 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. 


వరుణ్ తేజ్ లాస్ట్ సినిమా 'ఎఫ్ 2' బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోను చేరిన సంగతి తెలిసిందే. దీంతో వరుణ్ తేజ్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై భారీ ఆసక్తి నెలకొంటోంది. దానికితోడుగా రీమేక్ సినిమా చేయడంలో స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్ దర్శకత్వం వహించడం కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. మరి ఈ ప్రీ టీజర్ తో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారో లేదో వేచి చూడాలి. కాక పోతే డైలాగ్స్ లేని 'వాల్మీకి' ప్రీ టీజర్ లో ఏముంటుందని..? అన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: