మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉందో అందిరికీ తెలిసిందే.  డ్యాన్స్, ఫైట్స్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  అల్లు అర్జున్ హిట్ మూవీ ఆర్య సిక్వెల్ ఆర్య 2 మూవీ పెద్దగా హిట్ కాకపోయినా అల్లు అర్జున్, నవదీప్ కి మంచి పేరు వచ్చింది.  సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌  కోసం వీరిద్దరి పోటీ పడటం కనిపిస్తుంది. ఈ సినిమా మంచి సక్సెస్  అందుకుంది. అల్లు అర్జున్, నవదీప్‌ కలిసి ‘ఆర్య 2’ సినిమాలో నటించారు. ఇందులో వీరిద్దరు స్నేహితులుగా కనిపిస్తారు. 


సాధారణంగా సెట్స్ లో కలిసి పనిచేసినపుడు నటుల మద్య స్నేహసంబంధాలు ఏర్పడటం సహజం. ‘ఆర్య 2’ సినిమాలో షూటింగ్ సమయంలో అల్లు అర్జున్, నవదీప్ ల మద్య మంచి  స్నేహబంధం ఏర్పడింది.  రీసెంట్ గా నవదీప్‌ స్థాపించిన సి స్పేస్ అనే   సంస్థను అల్లు అర్జున్‌ లాంచ్ చేసారు. ఈ సందర్బంగా తన ప్రాణ స్నేహితుడి కోసం ఓ మంచి గిఫ్ట్ చేయాలని ప్లాన్ చేశాడు సుదీప్. 

సాధారణంగా సెట్స్ లో బావా అని పిలిచే  ఓ స్పెషల్ గిప్ట్ ను సిద్ధం చేయించారు. ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ ‘గోనగన్నా రెడ్డి’ పాత్రలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. బన్ని  ‘గమ్మునుండవోయ్..’ అంటూ చెప్పిన డైలాగ్‌లు, ఎక్సప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.  ఈ బుల్లి విగ్రహం చూడటానికి ఎంతో ఎట్రాక్షన్ గా కనిపిస్తుంది.  దీన్ని తన ప్రెండ్, బావ బన్నీకి ఇవ్వబోతున్నట్లు సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘బావకి ప్రేమతో ఓ చిరు కానుక’ అని నవ్వుతూ అల్లు అర్జున్‌ను ట్యాగ్‌ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: