సాధారంగా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్, పుట్టిన రోజు సంబరాలు అంబరాన్నంటేలా చేస్తారు.   పెద్ద పెద్ద కటౌట్స్ , పూజలు, స్వీట్లు పంచడం చేస్తుంటారు.  ఆగ్రహమైనా, అభిమానమైనా... మనసులోని భావాన్ని వ్యక్తపరచడంతో తమిళులు ఎప్పుడూ ముందుంటారు.  స్టార్ హీరోలు రజినీ, విజయ్, అజిత్, సూర్య సినిమాలు, పుట్టిన రోజు ఎంతో సందడి చేస్తుంటారు.  అయితే హీరోలు కూడా తమ అభిమానులకు సంబర పెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లకు దేవాలయాలు కట్టి పూజలు జరిపించారు. 


ఇక హీరోలు తమ అభిమానులకు ఏ సందేశం ఇచ్చినా..ఆదేశాలు ఇచ్చినా తూ.చ. తప్పకుండా పాటిస్తుంటారు.   ఆ మద్య జల్లి కట్టు సంప్రదాయాన్ని కాపాడాలని అభిమానులకు సందేశం ఇచ్చారు..హీరోలు అందే వేల మంది తరలి రావడం చూశాం.  తాజాగా హీరో విజయ్ 45వ పుట్టిన రోజు జరుపగా, వేలూరులో బంగారు ఉంగరాలను పంచిందో అభిమానసంఘం. తాజాగా  పట్టణంలోని బస్టాండ్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు  చేసి, విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం, పూజలు చేసి, మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు.


అంతే కాదు అందరూ ఆశ్చర్యపోయే విధంగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిచారు.   వేల్ మురుగన్ అధ్యక్షతన అభిమానులంతా పెట్ ల్యాండ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆ రోజు పుట్టిన శిశువులందరికీ ఉంగరాలు, దుస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విజయ్ ఫ్యాన్స్ పాల్గొని తమలోని అభిమానాన్ని చాటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: