ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ హీరోలకు తగ్గట్టుగా పారితోషకం తీసుకునేది విజయశాంతి. గతంలో అనేక సినిమాలతో బిజీగా ఉన్న విజయశాంతి 2006వ సంవత్సరంలో నాయుడమ్మ అనే సినిమాలో నటించి రాజకీయ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 13 సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రీ-ఎంట్రీ కి అదిరిపోయే ముహూర్తం ఫిక్స్ చేసుకుంది విజయశాంతి.


ఇటువంటి క్రమంలో ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మరియు అనేక విషయాల గురించి పంచుకోవడం జరిగింది. అప్పట్లో సంవత్సరానికి 17 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయని అంతేకాకుండా రోజుకు 7 షిఫ్ట్ లు పని చేశానని, తన కెరీర్ ను ఓ క్రమశిక్షణతో తీర్చిదిద్దుకోవడంతోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నానని, పంచభూతాలతో పోరాడాల్సి వచ్చిందని, పలుమార్లు గాయాలయ్యాయని కూడా అన్నారు.


తన జీవితంలో గుర్తుండిపోయిన విషయాల గురించి చెబుతూ, తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. విమానంలో తనతో పాటు చిరంజీవి, బాలకృష్ణ వంటి ఎంతో మంది ప్రముఖులు ప్రయాణిస్తున్న వేళ, ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిందని, ఈ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుందని చెబుతూ, ఆ ప్రమాదంలో తామంతా మరణించాల్సిందని, దేవుడి దయతోనే బతికి బయటపడ్డామని వ్యాఖ్యానించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: