బాలక్రిష్ణ సీనియర్ హీరో. ఆయనకు వేగంగా సినిమాలు చేస్తారని పేరుంది. అది సరే కానీ బాలయ్యకు మాత్రం హీరోయిన్లు ఓ పట్టాన కుదరవడంలేదు. టాప్ ఫోర్ లో ఉన్నా కూడా ఆయనతో జంట కట్టేందుకు పెద్దగా ఉత్సాహం చూపడంలేదు. దీంతో ఆయన 105 మూవీ వాయిదా పడుతూ వచ్చింది.


ఇపుడు హీరోయిన్ దొరికేసింది. బాలయ్యతో ఇప్పటికే మూడు మూవీస్ లో చేసిన శ్రియను కొత్త సినిమాలో తీసుకుంటున్నారు. బాలయ్య తో స్క్రీన్ షేర్ చేసుకునే విషయంలో శ్రియ ఓకే. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా పండుతుంది. బాలయ్య కూడా శ్రియ అయితే బెస్ట్ అనడంతో చిత్ర యూనిట్ ఒకే అన్నారట.


నిజానికి సినిమా యూనిటి మొదట్లో   చాలా మంది పేర్లు పరిశీలించారు. కొందరిని సంప్రదించారు. అయితే వారు నో అనేయడంతో ఇపుడు శ్రియకే వారూ ఓటు చేశారు.శ్రియ  బాలయ్య అంటే ఫ్రెష్ లుక్ రాదని అనుమానాలు ఉన్నా బాలయ్య మూవీలో ఆయనే డామినేటింగ్ రోల్, పైగా మాస్ హీరో కాబట్టి ఫోకస్ పూర్తిగా అటే ఉంటుందని సర్దుకుంటున్నట్లు భోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి: