సంచలన చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, గత కొద్దిరోజులుగా టిడిపి పార్టీపై అలానే చంద్రబాబు పై తనదైన శైలిలో పరోక్ష విమర్శలు చేస్తూ ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్మ చేస్తున్న కామెంట్స్ ని మాత్రం టిడిపిగాని ఆ పార్టీ నాయకులు గాని  పెద్దగా లక్ష్య పెట్టలేదు. ఇక ఎప్పటికపుడు జరిగే కొన్ని సమకాలీన అంశాలపై అలానే సినిమాలపై తన అభిప్రాయాన్ని తెలిపే వర్మ, 

కాసేపటి క్రితం తన శిష్యుల్లో ఒకడైన పూరి జగన్నాథ్ కు సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. గతంలో తాను నాగార్జునతో తెరకెక్కించిన శివ సినిమా హిందీ రీమేక్ లోని 'జగడి జగడి' సాంగ్ వీడియోలోని ఒక క్లిప్ ని వర్మ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ, ఆ పాటలో మధ్యలో అక్కడెక్కడో బ్లూ కలర్ షర్ట్ వేసుకుని అందరితో కలిసి డాన్స్ చేస్తున్న వ్యక్తి పూరి జగన్నాథ్, అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎంతగా ఎదిగాడో చూసారుగా అంటూ ఆ పోస్ట్ ద్వారా తెలిపారు. అయితే వర్మ పోస్ట్ కు బదులిచ్చిన పూరి, 

ఎస్ సార్ అది నేనే, ఈ వీడియో షేర్ చేసినందుకు థాంక్స్ అంటూ దణ్ణం పెడుతున్న ఎమోజిలు అయన పెట్టడం జరిగింది. దానికి వర్మ బదులిస్తూ, టాలెంట్ ఉన్న ఎందరికో నువ్వు ఒక పెద్ద ఇన్స్పిరేషన్, నీలాంటి వాళ్లను చూసి చాలా మంది నేర్చుకోవాలి అంటూ బదులిచ్చారు. అయితే వర్మ ఇపుడు ఈ వీడియో ఎందకు షేర్ చేసారో తెలియదు కానీ, అయన చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: