టాలీవుడ్ లో నటుడు, నిర్మాత మురళీ మోహన్ ఎన్నో విజయాలను చూశారు. ఓ వైపు నటుడిగా నటిస్తూ నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు.  రియలెస్టేట్ రంగంలో ఎన్నో పెట్టుబడులు పెట్టి మంచి బిజినెస్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు.   ఇటీవల మురళీ మోహన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ..తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు పంచుకున్నారు. 

తాను నటుడిగా ఉన్న సమయంలోనే బిజినెస్ రంగంపై వైపు మనసు మళ్లిందని ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో భాగస్వామిగా పెట్టుబడులు పెట్టాను. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఇద్దరు’ మూవీలో ఎంజీఆర్ - కరుణానిధి కథతో తెరకెక్కిందని అంతా చెప్పడంతో  డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశాము.ఆ సినిమా తొలి ఆటతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో, రెండవ ఆటకే వసూళ్లు పడిపోయాయి. 

దాంతో అప్పటి వరకు నేను అంతో ఇంతో సంపాదించినదంతా సినిమా కారణంగా పోయింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లోని భాగస్వాములు మోసం చేయడంతో మరో దెబ్బ తగిలింది. ఇక డిస్ట్రిబ్యూషన్ వైపు వెళల్లేదు..కానీ రియలెస్టేట్ రంగంలో మంచి అనుభవం గడించాను..ఎన్ని సమస్యలు ఎదురు వచ్చినా..ధైర్యంగా ముందుకెళ్లాను. నిజాయతీతో నిలబడిగలిగాను  అని చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: