ఎందుకనో మన హీరోయిన్లంతా బాలీవుడ్ వైపు ఆశగా ఎదురు చూస్తుంటారు. కళ్ల ముందు ఉన్న క్రేజ్ ను కాళ్ళతో తన్నేసుకొని మరీ హిందీ ఆఫర్ వస్తే చాలు క్షణాల్లో ముంబాయ్ ఫ్లైటెక్కేస్తారు. 2 ఫ్లాపులు అటు ఇటు వాయిస్తే గాని మనవాళ్లకు అసలు విషయం అర్థంకాదు. అప్పటికే జరగాల్సిన డామేజీ జరిగిపోతుంది. ఇటు సౌత్ లో కూడా క్రేజ్ తగ్గిపోతుంది. ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్న సామెత రివైండ్ వేసుకుంటారు. ఇలియానా, తమన్న, అసిన్, శ్రియ, జెనీలియా.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ కు వెళ్లి చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకున్న గ్లామర్ బ్యాచ్ చాలా పెద్దది. ఇన్ని అనుభవాలు కళ్లముందు పెట్టుకొని కూడా ఇప్పుడు పూజా హెగ్డే ఈ బ్యాచ్ లో చేరేందుకు తహతహలాడుతోంది. నాకు మాత్రం ఏం తక్కువనుకుందేమో మరి.


వాస్తవానికి పూజాహెగ్డేకు బాలీవుడ్ కొత్తకాదు. అక్కడ ఫ్లాప్ హీరోయిన్ ఇక మాకొద్దు అనిపించుకున్న తర్వాతే సౌత్ కు వచ్చింది. ఇప్పుడిక్కడ ఆమె స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్ లో స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేయకుండా మళ్ళీ నాకు హిందీ ఆఫర్ వచ్చిందంటూ అక్కడికెళ్తోంది పూజా. పోనీ అదేమన్న స్టార్ హీరో ఆఫరా అంటే.. కాదు. ఇంకా చెప్పాలంటే ఓ బి-గ్రేడ్ సినిమా.  తెలుగులో ఆమె కాల్షీట్ల కోసం స్టార్ హీరోలంతా వెయిటింగ్. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ సినిమాకు ఆమె ఓకే చెప్పడం కెరీర్ ను నాశనం చేసుకోవడమెందుకు అని చాలా మంది ఫీలవుతున్నారు. శృతిహాసన్ విషయంలో కూడా ఇంతకముందు జరిగిన సంగతి తెలిసిందే. 


తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉన్న టైమ్ లో బాలీవుడ్ కు వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇప్పుడు సౌత్ లో మళ్లీ సినిమా ఆఫర్ల కోసం ఆవురావురంటోంది. నిజానికి బాలీవుడ్ అనేది ఓ స్టేటస్. బాలీవుడ్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంటే ఆ కిక్కే వేరు. జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చు. కానీ కేవలం ఒక సినిమాకు ఆశపడి, వచ్చిన చిన్న చిన్న ఆఫర్లు ఒప్పుకొని ఎటూ కాకుండా పోతున్నారు మన స్టార్ హీరోయిన్లు. శ్రీదేవి, జయప్రద, విద్యాబాలన్ లాంటి కొంతమంది హీరోయిన్లకు మాత్రమే బాలీవుడ్ కలిసొచ్చింది. మిగతా 90 శాతం హీరోయిన్లు ఇలా చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకున్నవాళ్ళే. మరి పూజా ఏమాశపడుతుందో బాలీవుడ్‌లో. 



మరింత సమాచారం తెలుసుకోండి: