సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సూపర్ డూపర్ సక్సస్ తర్వాత ఫ్యామిలీతో లండన్ ట్రిప్ వేసి వచ్చేశాడు. ఇక వెంటనే సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడు. మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరూ వచ్చే నెల 5 నుంచి కాశ్మీర్ లో యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుపెట్టనున్నారు. మిలిటరీ దుస్తుల్లో ఫిట్ గా కనిపించేందుకు మహేష్ ఇప్పటికే రెడీ అయ్యాడట. ఇక సినిమాలో చాలా కీలకంగా అనిపించే వార్ ఎపిసోడ్ ని దర్శకుడు అనిల్ రావిపూడి రెండు హిందీ సినిమాల నుంచి స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. 


వాటిలో ఒకటి జె.పి.దత్త డైరెక్షన్‌లో బాబీ డియోల్, సునీల్ శెట్టి నటించిన బోర్డర్ కాగా రెండోది ఇటీవల వచ్చిన యుఆర్ ఐ అని సమాచారం. బాలీవుడ్ లో ఇప్పటి కూడా ఈ సినిమాలనే బెస్ట్ వార్ బేస్డ్ మూవీస్ గా చెప్పుకుంటారు. బోర్డర్ లో ఎమోషనల్ డ్రామా అద్భుతంగా ఉంటుందన్న విషయం సినిమా చూసిన అందరికి తెలిసిందే. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ మూవీ చాలామందికి బెస్ట్ ఫెవరెట్. ఇక యుఆర్ఐ ఈ ఏడాది మొదట్లో వచ్చిన బాక్స్ ఆఫీస్ వండర్. 


ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 220 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన యుఆర్ ఐలో అల్ట్రా స్టైలిష్ వార్ ఎపిసోడ్స్ ఉన్నాయి. గూస్ బంప్స్ ఇచ్చే ఫైట్స్ ఉన్నాయి. మహేష్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించే సీన్స్‌లో వీటిని కొంత బేస్ గా తీసుకుని  అనిల్ రావిపూడి డిజైన్ చేసాడట. ఇప్పటిదాకా కామెడీకే ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన అనిల్ రావిపూడి మరి ఈ వార్ సీక్వెన్స్ ని ఎలా బాలన్స్ చేస్తాడో చూడాలన్న ఆసక్తి అందరిలోను మొదలైంది. మరి అందరి అంచనాలను అనిల్ అందుకుంటాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: