వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల మ‌ధ్య హీరోగా న‌టిస్తున్నారు శ్రీ‌విష్ణు. కొత్త త‌ర‌హా కామెడీ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఈ నెల 28న విడుదల కాబోతున్న చిత్రంలో నివేదాథామ‌స్‌, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి  కొన్ని ఆశ‌క్తిక‌ర విశేషాలను నివేదాథామ‌స్‌ మీడియాతో పంచుకున్నారు...


సినిమా గురించి...
 సినిమా టైటిల్ లాగానే ‘బ్రోచేవారెవరురా’  సినిమా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అలాగే మన సమాజంలో కొన్ని అంశాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


మీ పాత్ర గురించి ...
 మిత్ర అనే పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర కూడా నా స్వభావానికి చాలా దగ్గర ఉన్న అమ్మాయే.  ఈ పాత్ర నాకే కాక‌ దాదాపు 90 శాతం అమ్మాయిలు మిత్రలాగే ఉంటారు.


 క్లాసికల్‌ డ్యాన్సర్‌ గా నటించ‌డానికి కార‌ణం...
చిన్నప్పటినుంచి నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ నే. ఐదేళ్ల వయసు నుండే క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఈ సినిమాలో మిత్ర క్లాసికల్‌ డ్యాన్సర్‌ గా గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంటుంది.


తెలుగు సినిమాల్లో ఎక్కువ‌గా న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం...
చాలా వరకూ ఎక్కువగా తెలుగులోనే నటించడానికే ప్రయత్నిస్తున్నాను. కానీ షూటింగ్స్ ఆలస్యం అవుతుండటంతో ఎక్కువ సినిమాలు కనిపించలేకపోతున్నాను. కానీ ‘బ్రోచేవారెవరురా’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది.

‘జై లవకుశ’లో చిన్న పాత్రలో నటించారు ...
నాకు ఎన్టీఆర్ గారంటే అంటే ఇష్టం. ఇక ఆ సినిమాలో నాది చిన్న పాత్ర అయినప్పటికీ చాల కీలకమైనది. అందులో న‌టించిన న‌టులంద‌రికీ వారి వారి క్యారెక్ట‌ర్‌కి త‌గిత ప్రాధాన్య‌త ఉంది.

‘దర్బార్‌’లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి కుమార్తెగా నటిస్తున్నారా..?
ఆఫ‌ర్ వ‌చ్చిన మాట నిజ‌మే కానీ ఇంకా ఫైనల్ కాలేదు.

మీ తదుపరి చిత్రాలు ...
తమిళ్‌లో ఒక సినిమా  తెలుగులో ఒక సినిమా ఉంది. ప్రస్తుతం దీని రిలీజ్ కోసం వెయిటింగ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: