Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 8:22 pm IST

Menu &Sections

Search

పాత్ర‌కు నేను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ను- డా.హ‌రినాథ్ పొలిచెర్ల‌

పాత్ర‌కు నేను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ను- డా.హ‌రినాథ్ పొలిచెర్ల‌
పాత్ర‌కు నేను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ను- డా.హ‌రినాథ్ పొలిచెర్ల‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విభిన్న‌మైన చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్న న‌టుడు డా.హ‌రినాథ్ పొలిచెర్ల‌. చంద్ర‌హాస్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మై ప‌వ‌ర్‌ఫుల్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా  'కెప్టెన్‌ రాణాప్రతాప్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. 'ఎ జవాన్‌ స్టోరి' అనేది క్యాప్షన్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కి, ఆడియోకి విశేష స్పందన లభిస్తోంది. జూన్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించికొన్ని విశేషాలు మీకోసం...దర్శకుడు, నిర్మాత డా. హరినాథ్‌ పొలిచెర్ల మాట‌ల్లో...


చాలా ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం గురించి...
 రెండుమూడేళ్లుగా మన దేశ శాంతి భద్రతలకు అఘాతం కలిగిస్తున్న, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక విషయాన్ని తీసుకొని సాధారణంగా మిలటరీ ఆఫీసర్స్‌ చేసే ఒక కోవర్ట్‌ ఆపరేషన్‌ని బేస్‌ చేసుకొని ఎంతో అద్భుతంగా రాసుకున్న కథే 'కెప్టెన్‌ రాణా ప్రతాప్‌'. మనం ఈ మధ్యకాలంలో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. చైనా సిల్క్‌ రోడ్‌ అనే ఒక ప్రాజెక్టుని స్టార్ట్‌ చేసి పాకిస్థాన్‌ ద్వారా బెలూచిస్థాన్‌ అనే ప్రాంతంలో ఉన్న వాగర్‌ అనే ఒక ఫిషింగ్‌ ల్యాండ్‌ని 50 సంవత్సరాలు లీజ్‌కి తీసుకొని అక్కడ ఒక పెద్ద సీ-పోర్ట్‌ని నిర్మిస్తోంది. దానికి కాపలాగా మిలటరీని కూడా ఏర్పాటు చేసింది. అలాంటి ఒక దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని భారత్‌ ఎలా ఒక కోవర్ట్‌ ఆపరేషన్‌ ద్వారా తెలుసుకుందో దానిని బేస్‌ చేసుకొని ఎంతో పవర్‌ఫుల్‌గా రాసుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. 


దేశ రహస్యాలకు సంబంధించిన అంశం అంటే  రీసర్చ్ ఏమైనా చేశారా...
 రీసర్చ్‌ అంటే... నాకు ఉన్న పరిచయాల ద్వారా కొంతమంది మిలటరీ ఆఫీసర్స్‌ని వారి దగ్గరకి వెళ్లి కలవడం, ఫోన్‌లో వాకబు చేయడం జరిగింది. అలాగే ఇటీవల ప్రచురితమైన వార్త పత్రికలోని ఆర్టికల్స్‌, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్‌ తీసుకున్నాకే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. 


మీ పాత్ర గురించి ...
 ఇందులో నా పాత్ర‌ పేరు 'కెప్టెన్‌ రాణా ప్రతాప్‌'. ఒక మిలటరీ ఆఫీసర్‌. ఒకసారి అనుకోకుండా పాకిస్థాన్‌కి వెళ్లడం జరుగుతుంది. ఇండియన్‌ మిలటరీ ఆఫీసర్‌ పాకిస్థాన్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లి ఏం చేసాడు.. అన్నదే కథ. 


ఈ మధ్యే ఇలాంటి సంఘటన జరిగింది కదా... 
 అవునండి! అభినందన్‌ అనే ఆర్మీ పైలెట్‌ పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కి సురక్షితంగా మళ్ళీ మన దేశం వచ్చిన సంగతి తెలిసిందే. అది జరిగి కొన్ని నెలలు మాత్రమే అయింది. అయితే నేను ఈ కథ రాసుకొని దాదాపు రెండు సంవత్సరాలు అయింది. వారు వెళ్లే ఉద్దేశ్యం కూడా విభిన్నంగా ఉంటుంది. దానికి, ఈ సినిమా స్టోరీకి సంబంధం ఉండదు. అయితే ఆ ఘటన మా సినిమాకు మంచి ప్లస్‌ అవుతుందనే అనుకుంటున్నాను. 

హీరో, ద‌ర్శ‌కుడు, ప్రొడ్యూస‌ర్ అన్నీ మీరే చెయ్య‌డానికి కార‌ణం...
కథ నేనే రాశాను. చిన్న చిన్న మైన్యూట్‌ పాయింట్‌లను కూడా తీసుకొని ఎంతో ప్రేమగా ఈ కథ రెడీ చేశాను. నేను ఏ సినిమా చేస్తున్నా కూడా నేను ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తానని మా దర్శకులు చెబుతుండేవారు. నేను 'చంద్రహాస్‌' సినిమా చేస్తున్నపుడు కీరవాణి తండ్రి శివ శక్తి దత్తగారు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. అందులోనూ ఈ క్యారెక్టర్‌ కోసం చాలా ఫిట్‌గా ఉండాలి. నేను గత పదిహేను ఏళ్లుగా మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తున్నాను. ప్రతి రోజు ఒక గంటన్నర జిమ్‌ కూడా చేస్తాను. నాది చాలా ఫిట్‌ బాడీ కనుకనే ఈ క్యారెక్టర్‌ చేయడానికి సిద్దమయ్యాను. 

వృత్తి ప‌రంగా  డాక్టర్‌ కదా! వృత్తిని, యాక్టింగ్‌ని ఎలా బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నారు...
 నేను నా జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్‌ సమయాన్ని వృత్తి ధర్మంగా నా వైద్యవృత్తికి కేటాయిస్తాను. మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్‌ మాత్రమే నటన, ప్రొడక్షన్‌కి కేటాయిస్తాను. అలా రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తూ వస్తున్నాను. మా గురువుగారు ఎన్‌. శివ ప్రసాద్‌గారు నన్ను చిన్నప్పటి నుండి నాటకాల్లో నటింపజేశారు. ఎన్నో సన్మాన పత్రాలు, అవార్డులు అందుకున్నాను. అలా నా మనోధర్మం ప్రకారం రెండిటినీ సమన్వయ పరుచుకుంటున్నాను. 

షూటింగ్ లొకేష‌న్స్ గురించి...
 సినిమా ఎక్కువభాగం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ జరిపాం. కొంత భాగం వికారాబాద్‌ ఫారెస్ట్‌లో చిత్రీకరించాం. ఇంకా కృష్ణపట్నం పోర్ట్‌ లోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. కృష్ణపట్నం పోర్ట్‌లో ఇంతవరకూ ఎవరూ చూపించని ఫ్రెష్‌ లొకేషన్స్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తాయి. 

 సుమన్‌ కీలక పాత్రలో కనిపిస్తున్నారు కదా! ఆయన గురించి...
 సుమన్‌గారు 500 సినిమాల్లో నటించారు. ఆయనతో నేను నటించినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఆయన ఎక్కువగా పోలీస్‌ ఆఫీసర్‌, మేజర్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఈ క్యారెక్టర్‌ వినగానే వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమాల్లో నన్ను లీడ్‌ చేసే మేజర్‌ క్యారెక్టర్‌. క్లైమాక్స్‌లో ఆయన యాక్షన్‌ ఎపిసోడ్‌ కూడా ఉంటుంది. అది కూడా సినిమాకు ప్లస్‌ అవుతుంది. 

 నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ గురించి...
 హిస్టారికల్‌ అంశం మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాను. నిజాంకాలంలో రజాకార్ల ఉద్యమం గురించి మీ అందరికీ తెలిసిందే. అప్పటి నిజాం అబ్దుల్‌ రజాక్‌ నాజ్వి, అతని అనుచరులు చేసిన ఘోరాల వల్ల ఒక కుటుంబం ఎలా కష్టపడింది? అనే పీరియాడిక్‌ ఫిలిం ప్లాన్‌ చేస్తున్నాను. దీనిని సరిగ్గా హ్యాండిల్‌ చేయగల దర్శకుడు దొరకగానే వివరాలు మీడియాకి వెల్లడిస్తాను.. అంటూ  ముగించారు.


harnath-polichela
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్రేషేడ్స్ తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టైల్లో ఉండే పాత్ర‌- విక్ర‌మ్‌
బుజ్జి బంగారం అంటున్న కార్తికేయ‌!
ఐసిసీకి అదిరిపోయే పంచ్‌
ఒక్క పోస్ట్  లో టాప్ లిస్ట్‌లోకి ప్రియాంక
‘ఓ బేబీ’ విజ‌యం అమ్మ, అమ్మమ్మకు అంకితం – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌
యూత్ ను ఆకట్టుకుంటొన్న  "కెఎస్100"
ఆఖ‌రి షెడ్యూల్ లో  `సుంద‌రాంగుడు` 
కులానికి అతీతంగా పెళ్లాడిన వంగ‌వీటి రంగా!
నిర్మాత‌ల‌ను త‌న చుట్టూ తిప్పుకున్న రాజ‌నాల‌...
వీరి మ‌ర‌ణాలు ఎప్ప‌టికీ మిస్ట‌రీలేనా...!
బికినీతో ఈషా రెబ్బా
నానా లాస్ రానా గెయిన్‌
వనవాసం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను - అల్లరి నరేష్.
ఎమోష‌న‌ల్ సీన్స్ అంద‌రి మ‌న‌సును క‌దిలించాయి - హీరోయిన్ అన్యా సింగ్
గడీల నేపథ్యంలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది....  నిర్మాతలు
బైలంపుడి ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్
 `శివ‌శంక‌రీ` ఫ్యూజ‌న్ కవ‌ర్  సాంగ్ లాంచ్‌!!
పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `ఎర్ర‌చీర‌`
నాచురల్ స్టార్ నాని 'గ్యాంగ్ లీడర్'  ఫస్ట్ లుక్
ఓ బేబిది ఊహించ‌ని విజ‌యం
పూరీతో చెయ్య‌డం ప‌రిణితి చెందిన భావ‌న క‌లిగింది- న‌భాన‌టేష్‌
సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి మనవరాలు పూజ వివాహం
ఆలీ హీరోగా
బడిదొంగ లోగో
'నిను వీడని నీడను నేనే' స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌
'నిను వీడని నీడను నేనే' స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌
నేడు తొలి ఏకాదశి
పూరి కొత్త బిజినెస్
పూర్తి ఫాంట‌సీ కామెడీలో అంజ‌లి
శుక్రవారం ప్రత్యేక నమాజ్ సూరా
“విక్స్” అంటే జలుబుకు మాత్రమే కాదు..!
 శుక్ర‌వారం ల‌క్ష్మీ క‌టాక్షం
ఈ స్త్రీ మూర్తులకు శతకోటి దండాలు
శివాత్మిక లేక‌పోతే దొర‌సాని లేదు- ద‌ర్శ‌కుడు కె.వి.ఆర్‌.మ‌హేంద్ర‌
 'ఉండి పోరాదే' సాంగ్ రిలీజ్ చేసిన డేరింగ్ డైరెక్టర్ వి వి వినాయక్
'నిను వీడని నీడను నేనే' ఫస్ట్ టికెట్ లాంచ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.