స్టార్ హీరోయిన్ సమంత కాస్త అక్కినేని ఇంట కోడలిగా మారింది. నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్ తర్వాత సమంత కెరియర్ పరంగా మరింత పుంజుకుందని చెప్పొచ్చు. డిఫరెంట్ స్టోరీస్ తో ఫీమేల్ లీడ్ సినిమాలు చేస్తున్న సమంత మిగతా హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తుంది. పెళ్లి తర్వాత ఒక హీరోయిన్ కు ఇంతగా క్రేజ్ ఉండటం అది సమంతకు మాత్రమే దక్కిన అదృష్టమని చెప్పొచ్చు.


ప్రస్తుతం ఓ బేబీ అంటూ జూలై ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమంత ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అంతేకాదు ఛాన్స్ దొరికితే చాలు ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. లేటెస్ట్ గా సమంత ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం తన అభిమానులే కాదు తోటి హీరోయిన్స్ కూడా ఆమెను ఇష్టపడేలా ఆ పిక్స్ ఉన్నాయి.  


సమంత లేటెస్ట్ ఫోటో షూట్ పై హీరోయిన్స్ రాశి ఖన్నా, హాన్సిక స్పందించారు. రాశి ఖన్నా సమంత పిక్స్ కి సో ప్రెట్టీ అని కామెంట్ పెట్టగా హాన్సిక ఎమోజీ పంపించి తన స్పందన తెలియచేశారు. తెలుగు, తమిళ భాషల్లో సమంత పెళ్లి తర్వాత కూడా దూసుకెళ్తుందన్న విషయం తెలిసిందే.


ఓ బేబీతో పాటుగా మామ నాగార్జున హీరోగా వస్తున్న మన్మథుడు 2లో కూడా సమంత ప్రత్యేక పాత్ర చేస్తుంది. సినిమాలో సమంత పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. సమంత జోరు చూస్తుంటే ఇలానే ఇంకొన్నాళ్లు స్టార్ స్టేటస్ కొనసాగించేలా ఉంది. ఆమెకు అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: