ఆ మద్య టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యాంకర్ లాస్య కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది.  యాంకర్ రవితో స్మాల్‌స్క్రీన్ షేర్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే టాప్ యాంకర్ లిస్ట్‌లో చేరింది లాస్య.  చలాకీగా యాంకరింగ్ చేస్తూ చాలా సాంప్రదాయబద్దంగా ఉండే యాంకర్ లాస్య పై ఆ మద్య రక రకాల రూమర్లు పుట్టుకు వచ్చాయి. తర్వాత మంజునాథ్ అనే వ్యక్తిని వివామం చేసుకుంది. వివాహం తర్వాత ఆమె మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు.  రెండున్నర నెలల క్రితమే ఆమె మగ బిడ్డకు జన్మినిచ్చింది.   

తాజాగా బిగ్ బాస్ 3 ద్వారా లాస్య టెలివిజన్ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా చేయమని మాటీవీ యాజమాన్యం కోరిందని.. దీనికి లాస్య కూడా అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. ఈ షో మరోసారి తనకి మంచి ఫేమ్‌ని తీసుకొస్తుందని లాస్య వెయిట్ చేస్తుందట.  అంతే కాదు ఈ షోలో పాల్గొంటున్నందుకు ఆమెకి 30 లక్షల వరకూ ముడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 


తాజాగా ఈ వార్తలపై యాంకర్ లాస్య స్పందించింది...బిగ్ బాస్ 3 లో నేను పాల్గొంటున్నానని నా సన్నిహితులంతా నాకు కాల్ చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నాకు రెండున్నర నెలల బాబు వున్నాడు. వాడితోనే సమయం సరిపోతుంది. ఈ టైం నాకు మళ్లీ మళ్లీ రాదు. సంవత్సరం వరకు వాడి ఆలనా పాలనా చూసుకోవలి. ఈ సారి అయితే బిగ్ బాస్ షో చేసే ఆలోచన లేదు. నెక్ట్స్ టైమ్ అవకాశం వస్తే చూద్దాం... అంటూ లాస్య స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: