పౌరాణిక సినిమాలు, చారిత్రాత్మక సినిమాలు అంటే కత్తి యుద్దలు, గుర్రపు స్వారీలు, వేల మంది సైన్యంతో భారీ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి.  అయితే అలాంటి షూటింగ్స్ కి ఎంత నైపుణ్యం ఉన్నవారు చేసినా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి.  అందుకే ఆయా సన్నివేశాల్లో నటించే ముందు నటులు ఎంతో ప్రాక్టీస్ చేసి ఓకే అనుకున్న తర్వాత సెట్స్ పైకి వెళ్తారు.  టాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు తీసే దర్శకధీరుడు రాజమౌళి తాజాగా రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. 

ఇప్పటికు రెండు షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న తరుణంలో ఆ మద్య రాంచరణ్ కాలికి గాయం కావడం, ఎన్టీఆర్ చేతి మణికట్టుకి గాయం కావడం వల్ల షూటింగ్ కి దూరమయ్యారు.  ఇప్పడు ఇద్దరు షూటింగ్ కి సిద్దంగా ఉన్నట్టు సమాచారం.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకోవాల్సి వచ్చింది. అందుకోసం ఆ గుర్రంతో నానా తంటాలు పడి ఎలాగైనా మచ్చిక చేసుకోవడానికి ఆరాటపడుతున్నట్లుంది ఎన్టీఆర్. 

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుర్రాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ఎన్టీఆర్ నానాతంటాలు పడుతున్నాడు. అయితే గుర్రపు స్వారీ సన్నివేశాల్లో నటించడానికి ఆమాత్రంకష్టపడి మచ్చిక చేసుకోవాల్సిందే అంటున్నారు..లేదంటే ఆ గుర్రంతో ఏమాత్రం తేడా కొట్టిన రచ్చ రచ్చే అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: