దర్శకులు, రచయితలు అన్నాక ఒకే పాయింటో కామన్ గా కథలను అల్లడం కామన్ అన్న విషయం చాలా మందికి తెలీదు. ఎందుకంటే ఎవరి స్టైల్లో వాళ్ళు తమ కథను తయారు చేసుకుంటారు. కానీ ఎంచుకున్న నేపథ్యం మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఆయా దర్శకుల సినిమాలు హిట్ ఫ్లాప్ అనేవి ఉంటాయి. ఎక్కడో ఓ పాయింట్ ఎవరికో తడుతుంది. లేదా దొరుకుతుంది. దాంతో ఇక అంతా దానివెంటే పడతారు. అందరి కన్నా ఒక బుర్ర.. రెండు మెదడులు అనే కాన్సెప్ట్ రచయిత రత్నంకు దొరికింది. 


ఆయన కథ అల్లి హీరో, నిర్మాతల కోసం తిరుగుతుంటే, దర్శకుడు చందు మొండేటి రెడీ అయిపోయారు. సవ్యసాచి అంటూ ఆయన స్టయిల్ లో ఆయనో కథ వేసుకున్నారు. ఆది హీరోగా బుర్ర కథ అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా కూడా రెండు మెదడుల కాన్సెప్ట్ తో తెరకెక్కించిందే.  ఇదిలావుంటే లాజికల్ గా వుండాలనే ఉద్దేశంతో దానికి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ చిప్స్ వంటి వ్యవహారాలు జోడించి పూరి జగన్నాథ్  ఇస్మార్ట్ శంకర్ అంటూ ముందుకు వస్తున్నారు. ఇదిలావుంటే ఇంక రెడీ కాని సినిమా ఒకటి వుంది. శ్రీవిష్ణు సినిమా 'తిప్పరా మీసం'. 


ఈ సినిమాకు కూడా రెండు మెదడుల కాన్సెప్ట్ నే కీలక ఆధారం అని తెలుస్తోంది. మొత్తానికి ఒక బుర్ర.. రెండు మెదడులు అన్న కాన్సెప్ట్ మన సినిమా జనాలకు బాగా పట్టేసినట్లుంది. ఎవరి కథలు వారు అల్లేసుకుంటున్నారు. మరి ఎవరి బుర్ర కథ హిట్టవుతుందో ఎవరి బుర్ర కథ ఫ్లాపవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: