దీపికా ప‌దుకొనె న‌టించిన‌ అప్‌క‌మింగ్ ఫిల్మ్ రామ్‌లీలా మూవీలో ఓ అద్భుతాన్ని బాలీవుడ్‌ చూడ‌బోతుంది. ఈ మూవీలో హీరోగా ర‌ణ్‌వీర్‌సింగ్‌, హీరోయిన్‌గా దీపికా ప‌దుకొనె న‌టించింది. వీరిద్దరూ ఎట్ ప్రెజెంట్ డేటింగ్‌లో ఉన్నార‌న్నది బాలీవుడ్ ఓపెన్ టాక్‌. కాని ఈ విష‌యాన్ని వీరిద్దరూ ఎప్పుడు ఒప్పుకోలేదు క‌దా, చాలా తెలివిగా ఈ వ్వవ‌హారాన్ని న‌డుపుతున్నారు.

అయితే రామ్‌లీలా మూవీలో మాత్రం కొన్ని సీన్స్‌లో వీరిద్దరూ రెచ్చిపోయే విధంగా రొమాన్స్ చేశారు. కొన్ని రొమాంటిక్ సీన్స్ షూటింగ్‌లోనూ అత్యంత చ‌ణువుగా సెట్స్ మీద వ్వవ‌హ‌రించారు. వీరిద్దరూ క‌లిసి చేసిన ఆ రొమాంటిక్ సీన్స్‌, ప్రేక్షకుల మ‌తి పోగొట్టడం ఖాయం అని బాలీవుడ్ అంటుంది. ఇప్పటికే ప్రమోష‌న్ కోసం రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో ర‌ణ్‌వీర్‌,దీపికా ఫ‌ర్‌ఫెక్ట్ మ్యాచ్ అని ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. 

ఈ మూవీ న‌వంబ‌ర్  15న స్క్రీన్స్‌ను హిట్ చేస్తుంది. దీపికా, ర‌ణ్‌వీర్‌ను ఎంత ఇష్టప‌డుతుందో తెలియాలంటే ఆ మూవీలో రొమాంటిక్ సీన్స్‌ను చూడాల్సిందే అని బాలీవుడ్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా వీరిద్దరూ దుబాయ్ వెళ్ళి, ఎవ‌రికి చెప్పకుండా ప‌ర్సన‌ల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసుకొని వ‌చ్చారు. ఎట్ ప్రెజెంట్ బాలీవుడ్‌లో హాట్ ఎఫైర్ జోడిగా వీరి వ్వవ‌హారం అంద‌రి నోటా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: