ఓక వ్య‌క్తి గురించి ద‌శాబ్దాలుగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్య‌క్తి చేసిన ప‌ని మాత్ర‌మే కాదు వారి గుణం, స్వ‌భావం. మూవీ ఆర్టిస్ట్ అసోసియెష‌న్ కి త‌న‌వంతు స‌హాయ‌న్ని ఇప్ప‌టికి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు అందిస్తున్నారనే వార్త నా హ్రుద‌యంలో బాగా నాటుకు పోయింది. ద‌ర్శ‌కురాలుగా సినిమాలు చేయ‌ట‌మే కాకుండా పేద క‌ళాకారుల‌కి స‌హ‌యం చేసే గొప్ప ల‌క్ష‌ణం త‌న సొంతం..ఛ‌లో చిత్రం లో న‌రేష్ గారితో న‌టించాను.

విజ‌య‌నిర్మల గారి గురించి చాలా అడిగి తెలుసుకున్నాను. సినిమా సినిమా సినిమా ఇదే ప్ర‌పంచం గా వుండేవార‌ట‌.. ప్ర‌తి వారం ఏ సినిమా విడుద‌ల‌య్యింది. వాటి ఫ‌లితాలు ఎలా వున్నాయ‌నే డిస్క‌ష‌న్ శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారితో వుండేద‌ట అంతలా సినిమా ని ప్రేమించే వ్య‌క్తి ఈ రోజు తెలుగు సినిమా అభిమానుల్ని అంద‌ర్ని ఇలా వ‌దిలి వెళ్ళి పోవ‌టం చాలా దుర‌దృష్ట‌క‌రం.. శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాని కొరుకుంటున్నాను.

అలాగే సూప‌ర్‌స్టార్ కృష్ణ గారికి, న‌రేష్ గారికి మ‌రియు వారి కుటుంబ స‌బ్యుల‌కి నా ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: