జ్యోతికకు రాజకీయాలపై ఆసక్తి ఉందా అంటే అవుననే అనిపిస్తుంది. తమిళ హీరో సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత హోమ్ మేకర్ పాత్రకే ఎక్కువగా పరిమితమైన జ్యోతిక ఈమధ్య పలు సినిమాల్లో నటించిన మళ్ళీ నటిగా బిజీ అయ్యింది. ఇప్పుడు సోషల్ వర్క్ లోను యాక్టివ్ గా మారింది. అయితే సాఫ్ట్ స్పోకెన్ విమెన్ అని పేరు తెచ్చుకున్న జ్యోతిక అపరాకాళికలా ప్రభుత్వాన్ని విమర్శించింది. దాంతో ఆమె చూపు రాజకీయాలపై ఉన్నదా అనే అనుమానాలు మొదలయ్యాయి.


'తమిళనాడు ప్రభుత్వ పాఠశాల్లో కనీస సదుపాయాలు లేవు. నెలలపాటు, సంవత్సరాల పాటు టీచర్లు విధులకు రావడం లేదు. రాష్ట్రంలో 35% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్నా.... సదుపాయాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. 


నీట్ విధానంలో అనేక లోపాలున్నాయి. వాటిని సరిచేయాలని, వసతులు కల్పించాలని' జ్యోతిక విమర్శలు చేసింది. దాంతో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి రెడీ అవుతుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: