గత కొద్దిరోజులుగా సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టిడిపి నేతలపై అలానే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై తనదైన శైలిలో తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పరోక్షంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఇటీవల అయన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయమై టిడిపి ప్రభుత్వం ఆ సినిమాలో చంద్రబాబు గారిని నెగటివ్ గా చూపించారని సినిమాని ఆంధ్రాలో విడుదల చేయనివ్వలేదు. అంతేకాదు ఆ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడలో సమావేశం పెట్టాలని భావించిన వర్మను అడ్డుకోవడంతో అప్పటినుండి అయన టిడిపిపై ఈ పరోక్ష విమర్శల దాడి మొదలెట్టారు. 

ఇక మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం తరువాత ఆ పార్టీ అధినేత జగన్ పై పొగడ్తల జల్లు కురిపిస్తూ, టిడిపిని ఎక్కుపెడుతూ వర్మ కొన్ని సెటైరికల్ పోస్టులు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి ఇప్పటివరకు టిడిపిపై తనదైన శైలిలో పోస్టులు పెడుతూ వస్తున్న వర్మ, నిన్న వైసిపి పార్టీ నేత బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నిన్న మీడియాతో చంద్రబాబుపై చేసిన విమర్శల వీడియోను షేర్ చేయడం జరిగింది. చంద్రబాబు అమరావతిని దేశంలోకెల్లా గొప్ప రాజధానిగా చేస్తాను అన్నారు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే రాళ్ళూ, రప్పలు, చెట్లు, మొక్కలు తప్ప ఏమి లేదు. ఇక అప్పట్లో రెండు రాష్ట్రాలకు తానే ఐటి ఇండస్ట్రీ ని తీసుకువచ్చాను అని గొప్పలు చెప్తారు, అంతేకాదు అమరావతికి ఒలింపిక్స్ తీసుకువస్తాను మీరు కష్టపడండి అని అబద్దాలు చెప్పారు, తీరా చూస్తే అదేమిలేదు. ఇక నావల్లనే ఈ దేశంలోని విద్యార్థులు ఎందరో పైచదువులు చదువుకుని విదేశాలకు వెళ్లి బాగా సెటిల్ అవుతున్నారు అంటూ మాట్లాడతారు. 

అయితే మన రాష్ట్రం వరకు చంద్రబాబు గారు తెలుసుకాబట్టి మన విద్యార్థులు అయన చెప్పినవి విని అక్కడికి వెళ్తున్నారు అనుకోవచ్చు. మరి పక్క రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో చంద్రబాబుగారు తెలియదు, వాళ్ళు కూడా అయన చెప్పారని విదేశాలకు వెళ్తున్నారా అంటూ ఎద్దేవా చేసారు. అయితే వర్మ ఈ వీడియోను షేర్ చేస్తూ, వైసిపి పార్టీలోని నాయకుల్లో ఒకరైన బుగ్గన, చంద్రబాబు కల్లబొల్లి మాటల పై ఏవిధంగా స్పందించారో చూడండి అంటూ ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసిన వర్మను కొందరు తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం ఆయనను సమర్థిస్తున్నారు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: