డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్'.  ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ గట్టిగానే ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.  ఇప్పటికే ఈ సినిమా నుండి 'దిమాక్ ఖరాబ్'..'జిందాబాద్ జిందాబాద్'  అంటూ సాగే లిరికల్ సాంగ్స్ ను విడుదల చేశారు. వీటితోపాటు 'గడబిడలకు బేఫికర్' అంటూ సాగే టైటిల్ సాంగ్ కూడా విడుదలయింది. ఈ సాంగ్స్ కి సంగీత దర్శకుడు మణిశర్మ ట్యూన్స్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి తాజాగా మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారు.


జూన్ 29 వ తేదీ ఉదయం 11  గంటలకు 'ఉండిపో' అనే పాటను విడుదల చేస్తున్నామని తెలుపుతూ 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.  ఈ పోస్టర్లో హీరోయిన్ నిధి అగర్వాల్ ను రామ్ ఎత్తుకోగా నిధి చేతులు వదిలేసి గాల్లో ఉంది.  నేపథ్యం బీచ్ లొకేషన్ కావడంతో పోస్టర్ పూరీ మార్క్ తో అదిరిపోయింది.   ఈ రొమాంటిక్ పోజు చూస్తుంటేనే పూరి జగన్నాథ్ ఈ పాటను ఏ రేంజ్ లో చిత్రీకరించాడో మనకు అర్థం అవుతోంది.  ఇప్పటివరకూ రిలీజ్ అయిన పాటలన్నిటికీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈ పాట కూడా సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చాలా ధీమాగా ఉన్నారట.


ఇక ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్ తో పాటు నభ నటేష్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది.  పూరి జగన్నాథ్.. ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని జులై 18 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు దర్శకుడు పూరీ జగన్నాథ్ కి, ఇటు హీరో రామ్ తో పాటు నిధీకి కూడా హిట్ చాలా అవసరం. మరి ఇస్మార్ట్ శంకర్ వీళ్ళకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: