సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుసు కదా.. కన్ను కొట్టి వీడియో క్లిప్ తో 'వింక్ గర్ల్' గా పాపులర్ ఆయిన ఈ బ్యూటీ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. 'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ 'లవర్స్ డే' తెలుగులో రిలీజ్ అయినా ఫ్లాప్ కావడంతోఎవరూ పట్టించుకోలేదు. అందుకు కారణం సినిమా రిలీజవ్వకుండానే కాస్త ఓవర్ యాక్షన్ చేసిందని కూడా అందరు పట్టించుకోవడం మానేశారు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ప్రియ త్వరలో టాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాను రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ సినిమాలో ప్రియా కేవలం 20 నిముషాల పాత్ర పోషించనుంది. మేయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాగా ప్రియా
సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రియ మరో విషయంలో ఒక్కసారిగా నెటిజన్లను మెస్మరైజ్ చేసేసింది. మలయాళంలో 'ఫైనల్స్' అనే టైటిల్ తో ఒక స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కైలాస్ మీనన్.  ఆయన ప్రియా వారియర్ తో ఒక పాట పాడించాడు.  'నీ మళవిల్లు పోలే'  అంటూ సాగే ఈ సాఫ్ట్ రొమాంటిక్ సాంగ్ ను నరేష్ అయ్యర్ తో కలిసి పాడింది.  


ఈ పాట మేకింగ్ వీడియోను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.  ఆ వీడియో ను ప్రియ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  క్యూట్ హస్కీ వాయిస్ తో ఎంతో మెలోడియస్ గా పాడిన ప్రియాను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీని సంగతి పక్కన పెడితే ప్రియా ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు.. కన్నడలో కూడా ఒక సినిమా చేస్తోందని లేటెస్ట్ న్యూస్.  


మరింత సమాచారం తెలుసుకోండి: