స్వీటీ అనుష్క భాగమతి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి, సైలెన్స్ సినిమాలు చేస్తున్న అనుష్క ఈ సినిమా తర్వాత మరో రెండు మూడు ఆఫర్లు లైన్ లో పెట్టిందట. కోనా వెంకట్ నిర్మాణంలో వస్తున్న సైలెన్స్ సినిమాలో మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. ఇది కేవలం తెలుగు, తమిళ, హింది భాషల్లోనే కాదు ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కిస్తున్నారు. 


ఇవే కాదు తనకు హాలీవుడ్ సినిమా చేయాలన్న ఆసక్తిని బయటపెట్టింది అనుష్క. సౌత్ లో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా హాలీవుడ్ లో ఛాన్స్ అంటే చాలు ఎగిరి గంతేస్తారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే హాలీవుడ్ సినిమాలు చేశారు. లేటెస్ట్ గా శృతి హాసన్ కూడా ఓ హాలీవుడ్ వెబ్ సీరీస్ కు సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది.


అయితే అనుష్క మాత్రం అక్కడ సినిమా ఛాన్స్ వస్తేనే చేస్తా అంటుంది. స్వీటీ కోరిక తెలిసిన హాలీవుడ్ దర్శకుడు ఎవరైనా సరే ఆమెకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలను మాత్రమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేసి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అనుష్క. 


ఈమధ్య కాస్త బొద్దుగా తయారై దాన్ని తగ్గించుకునేందుకు కొంత గ్యాప్ ఇచ్చింది కాని అమ్మడు ఓకే అంటే చాలు వరుస ఛాన్సులు వచ్చేస్తాయి. ఇంత క్రేజ్ వచ్చాక ఏది పడితే అది చేయకుండా విషయం ఉన్న డిఫరెంట్ సినిమాలను చేయాలని చూస్తుంది అనుష్క. ఒక్క హిట్టు పడితే మాత్రం అనుష్క మళ్లీ ఫాం లోకి వచ్చినట్టే.        



మరింత సమాచారం తెలుసుకోండి: