ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కావాల్సినంత అందం, ఉండాల్సినంత అభినయం ఉన్నప్పటికి ఎందుకనో చిన్న  చిన్న పాత్రలకే పరిమితమైపోతున్నారు. ఈ సారికి ఇది ఒప్పుకుంటే మరోసారి మంచి అవకాశం వస్తుందనే ఆశ కావచ్చు ఇంకేదైనా కావచ్చు. నిన్న విడుదలైన బ్రోచేవారెవరురా రాజశేఖర్ నటించిన కల్కిని తట్టుకుని మరీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి ఎంటర్ టైన్ మెంట్ తో సరదాగా గడిపిచిపోయేలా రాసుకున్న ఈ కిడ్నాప్ డ్రామా ప్రేక్షకులను బాగానే మెప్పిస్తోందని ప్రేక్షకులు చెబుతున్నారు. లీడ్ హీరోయిన్ నివేదా థామస్

అయినప్పటికీ మరో కీలక పాత్రలో నివేత పేతురాజ్ కూడా నటించింది. అయితే కథ ప్రకారం ఎక్కువ షేడ్స్ లేకపోవడం రెండు మూడు ప్లెయిన్ ఎక్స్ ప్రెషన్లు తప్ప ఎక్కువ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేయకపోవడం వల్ల తన కన్నా సత్యదేవ్ ఎక్కువ హై లైట్ అయ్యాడు ఈ సినిమాలో.
ఇటీవలే వచ్చిన చిత్రలహరిలో నివేతది కొంచెం బెటర్ రోలే అయినప్పటికీ అందులోనూ కళ్యాణి ప్రియదర్శన్ హీరోకు జోడి కావడంతో అప్పుడు అలానే జరిగింది. ఇక తమిళ్ లో చేసి తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాలు టిక్ టిక్ టిక్ -రోషగాడులో నివేత హీరోయిన్ అని గుర్తించేలోపే థియేటర్ల నుంచి మాయమైపోయాయి ఆ రెండు సినిమాలు. మంచి అందం గ్లామర్ టాలెంట్ అన్ని ఉన్న నివేతకు ఇలా జరగడం నిజంగా విచిత్రమే అనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు కమిట్ అయిన అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలో కూడా నివేత నుండి ఎక్కువ ఆశించడానికి ఉండకపోవచ్చు. ఎందుకంటే పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాబట్టి. 

అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత, అలాగే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఈషా రెబ్బ తరహాలోనే ఉంటుందన్న టాక్ ఇప్పటికే ఉంది. సో స్టార్ హీరోతో చేస్తున్న ఆనందం ఎక్కువ ఉండకపోవచ్చని అంటున్నారు. చూస్తుంటే వచ్చిన ఆఫర్స్ అన్నింటిని ఒప్పుకోవడం తప్ప నివేతకు వేరే ఛాయస్ కూడా కనిపిస్తున్నట్టు లేదు. మెంటల్ మదిలో ఇచ్చిన మంచి డెబ్యు సరిగా ఉపయోగపడలేదు. మరి ఈ అందగత్తే ఎప్పటికి స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంటుందో పాపం. 


మరింత సమాచారం తెలుసుకోండి: