ప్రస్తుతం బన్నీ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకి పోటీగా దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్-బన్నీ సినిమా ఉంటుందని మెంట్ వచ్చి చాలా రోజులే అయింది. అయితే ప్రస్తుతం ఆ సినిమా డిలే అయ్యోలా ఉందని లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్-దిల్ రాజు-సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. 

ఇందుకు సంబంధించి లేటెస్ట్ విషయం ఏమిటంటే, వేణు శ్రీరామ్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో బన్నీ రెండుకు పైగా గెటప్ ల్లో కనిపిస్తాడట. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ మిడిల్ ఏజ్డ్ గెటప్ లో కనిపించబోతున్నాడట. యంగ్ ఏజ్ లో ఓ గెటప్, అలాగే మిడిల్ ఏజ్డ్ లో ఓ గెటప్ ఈ సినిమాలో వుంటాయని ఫ్రెష్ అప్‌డేట్. అలాగే ఇంకో గెటప్ కూడా వుంటుందని, అయితే ఈ గెటప్ గురించి ఇంకా రివీల్ చేయలేదని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో బన్నీకి కాస్త ఎక్కువగానే విగ్ లు వాడాల్సి వుంటుందట.  

ఇప్పటి వరకు బన్నీ రకరకాల గెటప్ ల్లో కనిపించినా, వయసు మళ్లిన గెటప్ లేదా ఫార్టీ ఇయర్స్ లుక్ లో కనిపించలేదు. కానీ ఐకాన్ సినిమా అందుకు భిన్నంగా ప్రత్యేకతను చాటుకోనుందని టాక్. అలాగే బన్నీకి విగ్ లు వాడడం అన్నది కూడా చాలా  రేర్. కానీ ఐకాన్ సినిమాలో మాత్రం రెండు మూడు రకాల విగ్ లు వాడతారని తెలుస్తోంది. మరి బన్నీ ఈ గెటప్స్ లో ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో అప్పుడే మొదలైపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: