టాలీవుడ్ కి అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా సక్సెస్ ఫుల్ సినిమాలు అందిపుచ్చుకుంటూ మంచి కామెడీ హీరోగా పేరు సంపాదించాడు. తండ్రి ఇవివి సత్యనారాయణగారు ఎంతో గొప్ప డైరెక్టర్ అయినప్పటికీ నరేష్ మాత్రం అయన పేరు ఎక్కడా వాడుకోకుండా స్వయంకృషితో పైకి వచ్చారు అనే చెప్పాలి. ఇకపొతే కెరీర్ పరంగా 50 సినిమాలు ఎప్పుడో పూర్తి చేసిన నరేష్, కొన్నేళ్లుగా ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్నారు. 

అయితే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి అయన నటించిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ సక్సెస్ సాధించి, ఆ చిత్రంలో నరేష్ పోషించిన రవి పాత్రకు మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఇకపోతే నేడు నరేష్ బర్త్ డే కావడంతో అయన కొత్త సినిమాకు 'బంగారు బుల్లోడు' అనే టైటిల్ ని నిర్ణయించి, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. అనిల్ సుంకర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పివి గిరి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తుండగా నరేష్ సరసన పూజ ఝవేరి హీరోయిన్ గా నటిస్తోంది. 

అయితే బంగారాబుల్లోడు అనే ఈ టైటిల్, గతంలో యువరత్న బాలకృష్ణ, రవిరాజా పినిశెట్టిల కలయికలో రూపొంది అప్పట్లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. మరి ప్రస్తుతం ఆ సినిమా పేరు పెట్టుకున్న మన నరేష్ సినిమా, కేవలం పేరు వరకే పరిమితం అవుతుందో, లేక అప్పటి బంగారాబుల్లోడు రేంజ్ హిట్ ని అందుకుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: