యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అవగా థర్డ్ సాంగ్ గా కాలేజ్ క్యాంటీను అంటేనే ప్రేమ పక్షుల హెవెను అంటూ సాంగ్ వచ్చింది.


టోటల్ సాంగ్ మొత్తం కాలేజ్ క్యాంటీన్ లో షూట్ చేయగా సింగిల్ టేక్ లో సాంగ్ షూట్ చేయడం మరో విశేషం. విజయ్ దేవరకొండ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. అలా రిలీజైందో లేదో ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


ముఖ్యంగా ఈ సాంగ్ చూస్తుంటే శివ సినిమాలో బోటనీ పాఠముంది సాంగ్ గుర్తుకు వస్తుంది. సింగిల్ టేక్ లో చాలా న్యాచురల్ గా అనిపిస్తున్న ఈ పాట శివ పాటని గుర్తుకు తెస్తుంది. కాకినాడ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూలై 26న రిలీజ్ అవుతున్న సినిమాపై రిలీజైన కాలేజ్ క్యాంటీను సాంగ్ ఇంకాస్త క్రేజ్ తెచ్చింది. 


అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్ కు సినిమా సినిమాకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. కాలేజ్ క్యాంటీ సాంగ్ లో విజయ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి..



మరింత సమాచారం తెలుసుకోండి: