స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు  మేఘాంశ్  క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో  సినీ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...


శాంతి శ్రీహ‌రి మాట్లాడుతూ, ` మేఘాంశ్ `భైర‌వ` సినిమాలో న‌టించాడు. అదే త‌న తొలి సినిమా.  ఇది రెండ‌వ సినిమా. పాఠాలు చ‌ద‌వ‌డు. డైలాగులు పేజీలు బాగా చ‌దువుతాడు. అప్పుడే అర్ధ‌మైంది. బ్ల‌డ్ లో నే ఉంది. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత శ్రీహ‌రిగారి పేరును నిల‌బెడ‌తాడ‌న్న న‌మ్మ‌కం వ‌చ్చింది.  ఈ  కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అంద‌రికీ ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌తలు.  శ్రీహ‌రిగారికి ఇచ్చిన స‌పోర్ట్  నా బిడ్డ‌ల‌కు ఇస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.


హీరో మేఘాంశ్ మాట్లాడుతూ,` అమ్మ‌నాన్న‌ల వ‌ల్లే ఇక్క‌డ ఉన్నాను. డాడి లేక‌పోవ‌డంతో మ‌మ్మ‌ల్నిపెంచ‌డానికి అమ్మ చాలా క‌ష్ట‌ప‌డింది. ఇక సినిమా విష‌యానకి వ‌స్తే  జ‌న‌వ‌రిలో స్టార్ట్ చేసాం. త‌క్కు టైమ్ లో షూటింగ్ పూర్తిచేసాం.  మాద‌ర్శ‌కులు ఇద్ద‌రైనా ఒక‌రిగా ప‌నిచేసారు. చాలా క్లారిటీగా తీసారు. ఆదిత్య మీన‌న్ ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేసారు. సుద‌ర్శన్ పాత్ర  బాగా న‌వ్విస్తోంది. ప్రియాంక‌, న‌క్ష‌త్ర‌ల‌తో ప‌నిచేయ‌డం వెరీ హ్య‌పీ. అంతా చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసాం. జులై 5న రిలీజ్ అవుతుంది. పైర‌సీ ఎంక‌రేజ్ చేయ‌కండి. థియేట‌ర్ కు వ‌చ్చి చూడండి` అని అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కులు అర్జున్- కార్తీక్ మాట్లాడుతూ, ` నిర్మాత‌కు క‌థ చెప్ప‌గానే మూడు రోజుల్లో  ఒకే చేసారు. ద‌ర్శ‌కులుగా అవకాశం ఇచ్చ‌నింద‌కు ఆయ‌న‌కు థాంక్స్.. మేఘాంశ్ అన‌గానే  భ‌య‌ప‌డ్డాం. తను ఎద్ద డైరెక్ట‌ర‌స్ తో సినిమాలు చేయోచ్చు . కానీ మ్మ‌ల్ని న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు.  యూనిట్ అంతా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసారు. అందువ‌ల్లే సినిమా ఇంత బాగా వ‌చ్చింది` అని అన్నారు.


హీరోయిన్ న‌క్ష‌త్ర మాట్లాడుతూ, ` నేను తెలుగు అమ్మాయిని. నాతొలి సినిమా. కెరీర్ ఆరంభంలోనే  మంచి పాత్ర చేసాను.  ఈ టీమ్ తో ప‌నిచేస్తున్న‌ప్పుడు శ్రీహ‌రిగారి గొప్ప‌త‌నం తెలిసింది. మేఘాంశ్ మంచి కోస్టార్. అంద‌రితో స‌ర‌దాగా ఉంటాడు. అంతా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసాం. సినిమా మంచి విజ‌యం సాధిస్తుంది అని అన్నారు.
నిర్మాత అభిషేక్ మాట్లాడుతూ, `  శ్రీహ‌రిగారిలా , మేంఘాంశ్  పెద్ద పేరు సంపాదించాల‌ని కోరుకుంటున్నా. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకొస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అని అన్నారు.


చిత్ర నిర్మాత స‌త్యనారాయ‌ణ  మాట్లాడుతూ, ` రెండేళ్ల క‌ష్టం ఈ సినిమా. తొలి సినిమా ఇబ్బందుల్లో ఉంది. రెండ‌వ సినిమా  మొద‌లు పెట్టావ్ . ఏంటి నీ  ధైర్యం అని కొంద‌రు అన్నారు. నా ధైర్యం అమ్మానాన్న‌లు, స్నేహితులు, కుటుంబం. అంద‌రి ధైర్య‌మే ఈ సినిమా. నేను గొప్ప నిర్మాత అవుతను  అవుతానో?  లేదో తెలియ‌దు. కానీ అర్జున్- కార్తీక్ మంచి ద‌ర్శ‌కులు అవుతారు. మేఘాంశ్ అద్బుతంగా చేసాడు.  ఈ సినిమా అంద‌రికీ బ్రాండ్ లా నిల‌వాలి.  న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.


సుద‌ర్శ‌న్ మాట్లాడుతూ, ` ఇందులో  స్నేహితుడి పాత్ర‌లో న‌టించా. ఈ సినిమాతో ద‌ర్శ‌కుల‌కు మంచి పేరు వ‌స్తుంది. సినిమా స్పీడ్ గా అయిందంటే కార‌ణం నిర్మాతే. షూటింగ్ స‌మ‌యంలో  మేఘాంశ్ తో బ‌య‌ట వ్య‌క్తులు ఫోటోలు దిగిన‌ప్పుడే శ్రీహ‌రి గొప్ప‌త‌నం తెలిసింది అని అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: