యూత్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే.  ప్రేక్షకులల్లో  కానీ ట్రేడ్ లో కానీ ఎవరికీ ఈ విషయంలో సందేహాలు లేవు. అందుకే విజయ్ దేవరకొండ డైరీ ఓ రెండేళ్ళవరకూ ఖాళీ లేదు. విజయ్ దేవరకొండతో సినిమా ను నిర్మించేందుకు పెద్ద నిర్మాణ సంస్థలు కూడా రెడీ గా ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ తన సినిమాల బడ్జెట్ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాడట. అంతేకాదు ఈ విషయంలో విజయ్ న్యాచురల్ స్టార్ నాని ని ఫాలో అవుతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. 

నాని తన సినిమాల బడ్జెట్ లిమిట్ అసలు దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. సబ్జెక్ట్ కు అవసరమైన వరకే ఖర్చుపెట్టించడంతో పాటు బయ్యర్లకు అమ్మే సమయంలో కూడా వీలైనంతవరకూ రీజనబుల్ రేట్లకే అమ్మేలా జాగ్రత్తలు తీసుకుంటాడట. అందుకే సినిమా యావరేజ్ అయినా బయ్యర్లు సేఫ్ గా ఉంటారు. ప్రస్తుతం విజయ్ కూడా అదే ఫాలో అవుతున్నాడట.  విజయ్ సినిమాలపై నలభై కోట్ల రూపాయలు పెట్టేందుకు నిర్మాతలు.. బయ్యర్లు రెడీగా ఉన్నా తన బడ్జెట్ మాత్రం పాతిక కోట్ల రేంజ్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. అలా చేస్తే ఒకవేళ సినిమా అటూ ఇటూ అయిన సమయంలో నష్టాలు లేకుండా బయటపడవచ్చనే ఉద్దేశంలో ఉన్నాడట.

అంతే కాకుండా నాని లాగానే బడ్జెట్.. సినిమా బిజినెస్.. ప్రమోషన్స్ లో తన ఇన్వాల్వ్ మెంట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటున్నాడట. తన  మార్కెట్ స్టెబిలైజ్ అయ్యేవరకూ జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనలో ఉన్నాడట.  అంతా బాగానే ఉంది కానీ వరసగా రెండు యాభై కోట్లు వసూలు చేసే సినిమాలు పడితే అప్పుడు కూడా ఇదే రూట్లో ఉంటాడా లేదా అనేది చూడాలి. ఏదేమైనా విజయ్ నిర్మాతల హీరో అని మాత్రం అనిపించుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: