పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ బ్యూటీగా పాపులరైనా.. నటిగా పాయల్ ఎనర్జీకి మంచి గుర్తింపు దక్కిందన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే టాలీవుడ్ కోలీవుడ్ లో వరుసగా సినిమాలకు సంతకాలు చేసింది. ఓవైపు యంగ్ హీరోస్ సరసన సంతకాలు చేస్తూనే.. మరో వైపు స్టార్స్ సరసన నటించేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఓ బయోపిక్ లో పాయల్ వేశ్యగా నటించేందుకు సంతకం చేసి అందరికి ఝలక్ ఇచ్చింది. టైగర్ నాగ్వేశ్వర్ రావు బయోపిక్ గా రాబోతున్న ఈ సినిమాలో వేశ్య పాత్రకు నటించేందుకు స్కోప్ ఉందని సమాచారం. 

మరోవైపు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది పాయల్. విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామా.. మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కో రాజా సినిమాల్లోను నటిస్తోంది. ఆర్డీఎక్స్ లవ్ అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లోనూ ఛాన్స్ దక్కించుకుంది. రీసెంట్‌గా మరో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది. అయితే ఈసారి పోలీస్ గెటప్ లో కనిపించి ఊహించని షాకిచ్చింది.

ఓవైపు వేశ్య పాత్రలో నటిస్తున్న పాయల్.. ఇలా సడెన్ గా ఐపీఎస్ అధికారి గెటప్ లో దర్శనమిచ్చిందేంటి? అనుకుంటున్న వాళ్ళకి న్యూ బిగినింగ్.. మరో కొత్త తెలుగు సినిమాలో నటిస్తున్నా. ఇంకా  పేరు పెట్టలేదు. నా కెరీర్ లోనే స్ట్రాంగ్ రోల్ పోషిస్తున్నా.. నెర్వస్ గా ఉంది! అంటూ అప్‌డేట్ ఇచ్చింది. ఈ గెటప్ చూస్తుంటే పాయల్ సైబర్ క్రైమ్ పోలీస్ అధికారిగా నటిస్తోందని అర్థమవుతోంది.  అంటే ఐపీఎస్ అధికారి కిరణ్ భేడీ స్ఫూర్తితో తీస్తున్న సినిమానా.. ఇది? అన్నది తెలియాల్సి ఉంది. పాయల్ లో టెన్షన్ చూస్తుంటే కచ్ఛితంగా ఆ రేంజ్ పాత్రని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: